విజయం బీఆర్ఎస్దే..
కాంగ్రెస్, బీజేపీ ఎన్నికుట్రలు, కుతంత్రాలు చేసినా రాష్ట్రంలో విజయం సాధించేది బీఆర్ఎస్ అని, సీఎం అయ్యేది కేసీఆర్ మాత్రమేనని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు.
- కాంగ్రెస్, బీజేపీ కుట్రలు ఫలించవు
- ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు
- బీఆర్ఎస్లో చేరిన అల్లాదుర్గం మాజీ జడ్పీటీసీ దంపతులు
- రేగోడ్ మండల కాంగ్రెస్, బీజేపీ నాయకులు
- పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన మంత్రి
కాంగ్రెస్, బీజేపీ ఎన్నికుట్రలు, కుతంత్రాలు చేసినా రాష్ట్రంలో విజయం సాధించేది బీఆర్ఎస్ అని, సీఎం అయ్యేది కేసీఆర్ మాత్రమేనని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో అల్లాదుర్గం మండల మాజీ జడ్పీటీసీ దంపతులు కంచరి మమతాబ్రహ్మంతో పాటు రేగోడ్, అల్లాదుర్గం మండలాల బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్నివర్గాల సంక్షేమాన్ని కోరుకునేది సీఎం కేసీఆర్ ఒక్కరేనని పేర్కొన్నారు.
– అందోల్/అల్లాదుర్గం, అక్టోబర్ 20
అందోల్, అక్టోబర్ 20: కాంగ్రెస్, బీజేపీలు ఎన్నికుట్రలు, కుతంత్రాలు చేసినా రాష్ట్రంలో హ్యాట్రిక్ కొట్టేది బీఆర్ఎస్ పార్టే, సీఎం అయ్యేది కేసీఆర్ సారేనని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో అల్లాదుర్గం మండలం మాజీ జడ్పీటీసీ దంపతులు కంచరి మమతాబ్రహ్మం, రేగోడ్, అల్లాదుర్గం మండలాల బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరగా, వారికి మంత్రి హరీశ్‌రావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సబ్బండ వర్గాల సంక్షేమం గురించి ఆలోచించేది సీఎం కేసీఆర్ ఒక్కరేనని, అందుకే ప్రజలకు ఆయనపై అపారమైన ప్రేమ ఉన్నదన్నారు. జరుగనున్న ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్కు పట్టంకట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, పార్టీ శ్రేణులు ప్రజలతో మమేకమై ప్రచారం చేపట్టాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అసత్యాలు ప్రచారం చేస్తూ ప్రజలను గందరగోళంలోకి నెట్టే ప్రయత్నం చేస్తారని, వారితో జాగ్రత్తగా ఉండేలా ప్రజలను అప్రమత్తంగా ఉండేలా చూడాలన్నారు. అందోల్ గడ్డపై భారీ మెజార్టీతో గులాబీ జెండా ఎగురవేయాలని, అందుకోసం సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ మఠం భిక్షపతి, నియోజకవర్గం ఎన్నికల ఇన్చార్జి ఫారూఖ్‌హుస్సేన్, డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ జైపాల్‌రెడ్డి, మెదక్ జిల్లా యువజన సంఘాల అధ్యక్షుడు సాయిలు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహేశ్‌గౌడ్, బీసీ సంఘం అధ్యక్షుడు శేఖర్, నాయకులు మహేశ్‌గౌడ్, పవన్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | హైదరాబాద్ టు ఢిల్లీ వయా గోవా.. 80వ సారి సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ టూర్
దేవుడు దిగొచ్చినా నీళ్లు ఇవ్వలేం.. తాగునీళ్లు ఇస్తే గొప్ప.. సత్తుపల్లి సభలో మంత్రి తుమ్మల
Ponguleti Srinivas Reddy | నీళ్లు రావు.. కరెంట్ లేదు.. రైతులు రెండో పంట వేయొద్దు.. మంత్రి పొంగులేటి కీలక సూచన
Kodangal | సీఎం ఇలాకాలో నీటి కటకట.. కొడంగల్‌లో తాగునీటికి తిప్పలు.. ప్రజల అవస్థలు
Buldozers Demolition | అర్ధరాత్రి వేళ పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు… 12 జేసీబీలతో 348 ఇండ్లు కూల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

