Pocso Act | శివ్వంపేట, సెప్టెంబర్ 25 : పోక్సో కేసులో నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష వేయడం జరిగిందని శివ్వంపేట ఎస్ఐ మధుకర్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శివ్వంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రైమ్ నెంబర్ 238/2023 కేసులో మండలంలోని చండి గ్రామానికి చెందిన ప్రధాన నిందితుడు యమ్చర్ల దుర్గయ్య (58) అతనికి వ్యతిరేకంగా వచ్చిన అభియోగాల ప్రకారం ప్రధాన జిల్లా, సెషన్స్ జడ్జ్ జి.నీలిమ, మెదక్ ఫాస్ట్ ట్రాక్ పోక్సో కోర్టు జడ్జిగా విచారణ చేసి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 15వేల జరిమానా విధించారన్నారు.
ఈ కేసులో నిందితుడికి శిక్షపడేలా వ్యవహరించిన శివ్వంపేట ఎస్ఐ మధుకర్ రెడ్డిని, తూప్రాన్ సీఐ రంగా కృష్ణను, కోర్టు కానిస్టేబుల్ రవి, ఆనంద్, కృష్ణలను తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ అభినందించారు.
Woman Molest | వివాహితపై పోలీసుల అఘాయిత్యం.. కేసు నమోదు
Mulugu | ములుగు జిల్లాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం..
KCR | కొంపెల్లి వెంకట్ గౌడ్ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటు : కేసీఆర్