బెజ్జంకి, మార్చి 17: మానకొండూర్ నియోజకవర్గంలో పంటలు ఎండుతుంటే స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ విమర్శించారు. బెజ్జంకి మండలంలోని గుండారం శివారులో రైతులు గైండ్ల నర్సయ్య, బొప్పెన కుంటయ్య, యాదయ్య, శ్రీనివాస్‌రెడ్డికి చెందిన ఎండుతున్న పంటలను ఆయన పరిశీలించారు. అనంతరం చౌడారం నుంచి వచ్చే ప్రధాన కాలువను పరిశీలించారు. కాలువకు మరమ్మతులు చేసి నీటిని విడుదల చేయాలని అధికారులను కోరారు. ఈ సందర్భంగా రసమయి మాట్లాడుతూ..నియోజకవర్గంలో పంటలు ఎం డుతుంటే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రంగులు చల్లుకుంటూ పండుగ చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.
గుండారం గ్రామ శివారులోని చౌడారం నుంచి వచ్చే కాలువకు మరమ్మతులు చేస్తే పంటలు ఎండిపోయే దుస్థితి వచ్చేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో వందల ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయని, సాగునీళ్లు ఇవ్వాలని రైతులు, నాయకులు కోరుతే ఎమ్మెల్యే అనుచరులు ఎండిన పొలాలను చూసి హేళన చేసి మాట్లాడడం సిగ్గు చేటన్నారు. ఓవైపు పం టలు ఎండుతుంటే పెట్టుబడి అందక, రుణమాఫీ కాకా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రైతుల ఉసురు కాంగ్రెస్‌కు తప్పకుండా తలుగుతుందని విమర్శించారు.
ఎమ్మెల్యేకు మానవత్వం లేదన్నారు. రైతును రాజు చేస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, రైతుల నోట్లో మట్టికొట్టేలా వ్యవహరిస్తున్నదని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ హయాంలో ఒక్క గుంట ఎండిన సందర్భం లేదన్నారు. బీఆర్ఎస్ హ యాంలో మంటుటెండల్లో నీళ్లిచ్చి పంటలను కాపాడినట్లు గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఎక్కడికక్కడ పంటలు ఎండుతున్నాయని, మేడిగడ్డ వద్ద గోదావరిలో పుష్కలంగా నీళ్లున్న బీఆర్ఎస్పై కోపంతో నీళ్లు పంపింగ్ చేయడం లేదని ఆరోపించారు. ఎండిన వరి పంటకు ప్రభుత్వం ఎకరాకు రూ.20 వేల నష్టపరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశాడు.
ఎమ్మెల్యేకు రైతులపై ప్రేమ ఉంటే వెంటనే పంటలకు సాగునీళ్లు ఇప్పించాలని, నిలిచిన పోయిన కాలువల పనులు పూర్తి చేయించి వినియోగంలోకి తీసుకు రావాలన్నారు. లేకపోతే రైతులకు క్షమాపణ చెప్పాలని రసమయి బాలకిషన్ డిమాండ్ చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు పాకాల మహిపాల్‌రెడ్డి, నాయకులు లిం గాల లక్ష్మణ్, ఎలుక దేవయ్య, బొమ్మకంటి రామలింగారెడ్డి, దీటి రాజు, లక్ష్మారెడ్డి, తిరుపతిరెడ్డి, అంజయ్య, భీమయ్య, గురువారెడ్డి, బాబు, అమరేందర్‌రెడ్డి, నరేశ్, రమేశ్, మల్లేశం, సురేందర్‌రెడ్డి, శ్రీనివాస్, సురేశ్, రా ములు, ప్రవీణ్, యాదయ్య, భూంరెడ్డి పాల్గొన్నారు.