గజ్వేల్‌లో అభివృద్ధికే పట్టం కట్టిన ప్రజలు
మున్సిపల్ ఎన్నికలో గజ్వేల్ పట్టణ ప్రజలు అభివృద్ధి చేసిన బీఆర్ఎస్కు ఓటేశారని, రేవంత్‌రెడ్డి ప్రభు త్వం అబద్ధాలను నమ్మలేదని బీఆర్ఎస్ గజ్వే ల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు.
- కాంగ్రెస్‌కు బీజేపీ కౌన్సిలర్లను అమ్ముకున్న ఎంపీ రఘునందన్
- దమ్ముంటే ఎంపీ చర్చకు రావాలి
- జడ్పీటీసీలను క్లీన్ స్వీప్ చేస్తాం
- బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి
గజ్వేల్, ఫిబ్రవరి 17: మున్సిపల్ ఎన్నికలో గజ్వేల్ పట్టణ ప్రజలు అభివృద్ధి చేసిన బీఆర్ఎస్కు ఓటేశారని, రేవంత్‌రెడ్డి ప్రభు త్వం అబద్ధాలను నమ్మలేదని బీఆర్ఎస్ గజ్వే ల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. మంగళవారం గజ్వేల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గజ్వేల్‌లో కేసీఆర్ సీసీ రోడ్లు, మురుగుకాల్వలు, యూజీడీ, మహతి ఆడిటోరియం, అద్భుతమైన ఎడ్యుకేషన్ హబ్, ఇంటింటి మిషన్ భగీరథ తాగునీళ్లు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ప్రభుత్వ దవాఖానలు నిర్మించారన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో 10 గ్రామాలను ఏకగ్రీవం చేసుకోగా, వందకు పైగా గ్రామాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందినట్లు తెలిపారు.
గజ్వేల్‌లో 12మంది, తూప్రాన్‌లో 9మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ తరపున గెలుపొంది రెండింటిలో గులాబీ జెండా ఎగురవేశామన్నారు. తూప్రాన్ మున్సిపాలిటీలో ముగ్గురు బీజేపీ కౌన్సిలర్లను ఎంపీ రఘునందన్ కాంగ్రెస్‌కు అమ్ముకున్నారని ఆరోపించారు. దమ్ముంటే రఘునందన్ దీనిపై చర్చ కు రావాలని సవాల్ విసిరారు. ప్రజలు బీజేపీకి ఓటేస్తే కాంగ్రెస్‌కు కౌన్సిలర్లను అమ్ముకున్నారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. బీజేపీ నైతికత కోల్పోయిందని, ప్రజలు తగిన బుద్ధి చెప్పుతారని అన్నారు. ఆర్అండ్ఆర్ కాలనీలో అడ్డదారిలో ప్రజలను నమ్మించి గెలిచారని, గెలిచిన కౌన్సిలర్లు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, నెల రోజుల్లో సమస్యను పరిష్కరించకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
త్వరలో జరగబోయే జిల్లా పరిషత్ ఎన్నికల్లో అన్ని స్థానాలను గెలుస్తామని వంటేరు ప్రతాప్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నూతన మున్సిపల్ చైర్పర్సన్ చందనారవీందర్ మాట్లాడుతూ.. అందరి సహకారంతో మున్సిపల్ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. సమావేశంలో వైస్ చైర్పర్సన్ పద్మాబాయినర్సింగరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మండల పార్టీ అధ్యక్షులు మధు, నవాజ్, కౌ న్సిలర్లు మమత, మమతాసంతోష్, స్వప్న, మురళి, శ్రీధర్, బాపురాజు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Badangpet | బడంగ్‌పేట అక్రమాల్లో కొత్త కోణం.. 250 ఫైళ్లపై గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు
Singareni Bonus | బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
Insurance Scam | అల్లుడి కోసం గిల్లుడు.. 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
Harish Rao | బెనిఫిట్స్ కోసం వృద్ధులు రోడ్డెక్కాలా?.. సీఎం రేవంత్‌ను నిలదీసిన హరీశ్‌రావు
Horoscope | 14-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

