e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home జిల్లాలు విత్తనాల ఎంపికలో అప్రమత్తంగా ఉండాలి

విత్తనాల ఎంపికలో అప్రమత్తంగా ఉండాలి

విత్తనాల ఎంపికలో అప్రమత్తంగా ఉండాలి

బేల,జూన్‌ 5: రైతులు విత్తనాలు తీసుకునే సమయంలో అప్రమత్తంగా ఉండాలని మండల వ్యవసాయాధికారి విశ్వామిత్ర అన్నారు. మండల కేంద్రంలోని ఫెస్టిసైడ్‌ దుకాణాలను వ్యవసాయ విస్తరణ అధికారులతో కలిసి శనివారం తనిఖీ చేశారు. స్టాక్‌ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నకిలీ ఎరువులు, విత్తనాలు, రసాయనాలు విక్రయిస్తే దుకాణాలు సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. డీలర్లందరూ రోజువారీ నివేదికను వ్యవసాయ అధికారులకు అందించాలని సూచించారు. రైతుల కు తప్పకుండా రసీదు ఇవ్వాలని వ్యాపారులకు సూచించారు. వ్యవసాయ విస్తరణ అధికారులు రాజు, నగేశ్‌, తదితరులున్నారు.
బోథ్‌, జూన్‌ 5: రైతులకు అనుమతి లేని విత్తనాలు అ మ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని బోథ్‌ సీఐ ముదావత్‌ నైలు, ఎస్‌ఐ రాజు హెచ్చరించారు. బోథ్‌లోని ఎరువులు, విత్తనాల దుకాణాలను శనివారం వారు తనిఖీ చేశారు. పత్తి విత్తనాల ప్యాకెట్లను పరిశీలించారు. విత్తనాలు కొన్న త ర్వాత రసీదు తప్పకుండా తీసుకోవాలని రైతులకు సూచిం చారు. ప్రభుత్వం అనుమతించిన కంపెనీల విత్తనాలు మా త్రమే అమ్మాలని వ్యాపారులకు సూచించారు.
సిరికొండ, జూన్‌ 5: రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు తీసుకుంటామని ఇచ్చోడ ఏడీ రామకృష్ణ అన్నా రు. మండలంలోని పొన్న ఎక్స్‌రోడ్డు వద్ద ఉన్న ఎరువులు, విత్తనాల దుకాణాలను శనివారం తనిఖీ చేశారు. స్టాక్‌ రికార్డులను పరిశీలించారు. రైతులు లైసెన్స్‌ ఉన్న దుకాణా ల్లోనే విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. డీలర్లు నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు తీసుకుంటామన్నారు. నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే దుకాణాలను సీజ్‌ చే స్తామని వ్యాపారులను హెచ్చరించారు. డీఏవో రమేశ్‌, వి స్తరణ అధికారి దీపక్‌, డీలర్లు ఓంప్రకాశ్‌, తుకారాం, త దితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
విత్తనాల ఎంపికలో అప్రమత్తంగా ఉండాలి

ట్రెండింగ్‌

Advertisement