ఓటు హక్కు నమోదు చేసుకోవాలి

- కలెక్టర్ భారతీ హోళికేరి
- ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవం
హాజీపూర్,జనవరి 25 : 18 ఏండ్లు నిండిన వారు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని కలెక్టర్ భారతీ హోళికేరి పేర్కొ న్నారు. సోమవారం 11వ జాతీయ ఓటరు దినోత్సవం సంద ర్భంగా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ బా ధ్యతగా ఓటు వేయాలన్నారు. ఓటు నమోదు, వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఓటరుగా నమోదు చేసుకున్న యువతీ యువకులకు ఓటరు కార్డులు అందజేశారు. కలెక్టరేట్ ఏవో సురేశ్, ముఖ్య ప్రణాళికాధికారి సత్యనారాయణ, ఎన్నికల విభాగం అధికారులు శ్రీనివాస్, రజనీ, తహసీల్దార్ పిన్న రాజేశ్వర్ పాల్గొన్నారు.
మంచిర్యాల అర్బన్, జనవరి 25 : డీఈవో కార్యాలయంలో జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. డీఈవో వెంకటేశ్వర్లు జిల్లా సైన్స్ అధికారి మధుబాబు, సెక్టో రియల్ అధికారులు సప్ధర్ అలీ, శ్రీనివాస్, పద్మజ, సిబ్బంది విజయ్, సత్యనారాయణ, రుక్మిణి పాల్గొన్నారు. మానవ హక్కుల పరిరక్షణ సంఘం నాయకులు శ్రీహర్ష డిగ్రీ కళాశాల లో ప్రతిజ్ఞ చేశారు. చేరాల వంశీ, కళాశాల ప్రిన్సిపాల్ పోటు మనోహర్ రెడ్డి, రూపేష్, మధు, సాత్విక్, చరణ్, సాయితేజ, రాజు, రవి, వేణు, నారాయణ, రాజేందర్ పాల్గొన్నారు.
చెన్నూర్, జనవరి 25 : జాతీయ ఓటరు దినోత్సవాన్ని నిర్వహించారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మంత్రి బాపు, జడ్పీటీసీ మోతె తిరుపతి, ఎంపీడీవో వేముల మల్లేశం, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లెల దామోదర్‌రెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, తహసీల్ కార్యాల యంలో తహసీల్దార్ జ్యోతి, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు.
తాండూర్, జనవరి 25: తహసీల్దార్, ఎంపీడీవో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులతో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. జడ్పీటీసీ సాలిగామ బానయ్య, తహసీల్దార్ కవిత, ఎంపీడీవో శశికళ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
నెన్నెల, జనవరి25 : తహసీల్ కార్యాలయ ఆవరణలో ఆయా శాఖల అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. తహసీ ల్దార్ సంపతి శ్రీనివాస్, ఎంపీడీవో వరలక్ష్మి, ఆర్ఐ గణేశ్, పీఆర్ ఏఈ కామేశ్వర్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
లక్షెట్టిపేట రూరల్, జనవరి 25 : తహసీల్ కార్యాలయంలో ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించారు. మండల పరిష త్ కార్యాలయంలో ఎంపీడీవో ప్రతిజ్ఞ చేయించారు. మున్సి పల్ చైర్మన్ నల్మాసు కాంతయ్య, తహసీల్దార్ వేముల రాజ్‌కుమార్, వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్, ఎంపీడీవో సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి, బీఎల్వోలు, సిబ్బంది పాల్గొన్నారు.
హాజీపూర్, జనవరి 25 : మండల కేంద్రంలో జాతీయ ఓటరు దినోత్సవం నిర్వహించారు. ఓటరు కార్డులు అంద జేశారు. తహసీల్దార్ జమీర్, దొనబండ సర్పంచ్ జాడి సత్యం, వైస్ ఎంపీపీ బేతు రమాదేవి, కార్యదర్శి మాధవ్, వార్డు సభ్యులు, ఆర్ఐ ప్రభులింగం ప్రజలు పాల్గొన్నారు.
కోటపల్లి, జనవరి 25 : తహసీల్, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రతిజ్ఞ చేశారు. తహసీల్దార్ రామ చంద్ర య్య, ఎంపీడీవో కొలిపాక భాస్కర్, డీటీ గోవింద్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బైస ప్రభాకర్, సర్పంచ్‌లు, కార్యద ర్శులు, తదితరులు పాల్గొన్నారు.
భీమారం, జనవరి 25 : మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో ఓటరు దినోత్సవం నిర్వహించారు. ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో శ్రీపతి బాపు, ఉప సర్పంచ్ బానోత్ అమర్ సింగ్ నాయక్, కార్యద ర్శి సర్వశేష్ఠ, తదితరులు పాల్గొన్నారు.
జన్నారం, జనవరి 25 : మండల కేంద్రంలో అంబేద్కర్ చౌక్ ఎదుట తహసీల్దార్ పుష్పలత ఆధ్వర్యంలో ప్రజలు, అధి కారులతో ప్రతిజ్ఞ చేయించారు. అంగన్వాడీ కార్యకర్తలు, వీఆ ర్వోలు, వీఆర్ఏలు, తదితరులు పాల్గొన్నారు.
బెల్లంపల్లిరూరల్, జనవరి 25 : మండల పరిషత్ కార్యాల యంలో జాతీయ ఓటరు దినోత్సవ కార్యక్రమాన్ని ఎంపీపీ గోమాస శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరుపుకున్నారు. ఎంపీపీ శ్రీనివాస్, ఎంపీడీవో విజయలక్ష్మి, అధికారులు, సిబ్బంది ఓటరు దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.
వేమనపల్లి, జనవరి 25 : తహసీల్దార్ మధుసూదన్ ఆధ్వ ర్యంలో ఓటరు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రతిజ్ఞ చేయించారు. డిప్యూటీ తహసీల్దార్ శ్రావణి, సర్పంచు కుబిడె మధుకర్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
కాసిపేట, జనవరి 25 : ఎంపీడీవో, తహసీల్ కార్యాలయ ఆవరణలో, గ్రామ పంచాయతీల్లో జాతీయ ఓటర్ల దినోత్సవా న్ని నిర్వహించారు. ఎంపీపీ రొడ్డ లక్ష్మి, జడ్పీటీసీ పల్లె చంద్ర య్య, వైస్ ఎంపీపీ విక్రంరావు, తహసీల్దార్ భూమేశ్వర్, ఎంపీడీవో ఎంఏ అలీం, ఎంపీటీసీలు కొండబత్తుల రాంచంద ర్, అక్కెపల్లి లక్ష్మి, ఉప సర్పంచ్ పిట్టల సుమన్ పాల్గొన్నారు.
కన్నెపల్లి, జనవరి 25 : తహసీల్ కార్యాలయంలో జాతీయ ఓటరు దినోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం ఇద్దరు సీనియర్ ఓటర్లను సన్మానించారు. తహసీల్దార్ మునావర్ షరీఫ్, ప్రకాశ్, కార్యాలయం సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.
తాజావార్తలు
- రికార్డు స్థాయిలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు : ఎమ్మెల్సీ కవిత
- పటాకుల తయారీ కేంద్రంలో పేలుడు, ఆరుగురు దుర్మరణం
- ' ఉప్పెన' మేకింగ్ వీడియో చూడాల్సిందే
- మతిస్థిమితం లేని వ్యక్తిని.. కుటుంబంతో కలిపిన ఒక పదం
- రికార్డులు బ్రేక్ చేసిన అశ్విన్
- నవభారత నిర్మాణంలో యువత భాగం కావాలి: వెంకయ్య పిలుపు
- వీడియో : జపాన్ కేబినెట్ లో వింత శాఖ
- ‘మూడ్’మారుతోందా!: వచ్చే ఏడు 13.7 శాతం వృద్ధి !!
- సూరత్‌లో బీజేపీ కన్నా ఆప్‌కు ఎక్కువ ఓట్లు
- నూతన ఐటీ నిబంధనలు అమలైతే వాట్సాప్‌కు చిక్కులే!