మాస్టర్‌ప్లాన్ తయారు చేయండి

- మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళీకేరి
- అభివృద్ధి పనులపై మున్సిపల్ కమిషనర్లతో సమీక్షా సమావేశం
మంచిర్యాల అగ్రికల్చర్ : జిల్లాలోని ప్రతి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం 25-30 ఏళ్ల వరకు ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని కమిషనర్లకు మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి సూచించారు. కలెక్టరేట్లోని చాంబర్లో శనివారం జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి మున్సిపల్ కమిషనర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మున్సిపాలిటీల్లో చేపట్టిన డంప్‌యార్డులు, వైకుంఠధామాల పనులను త్వరగా పూర్తిచేయాలన్నారు. ఇందుకోసం భూముల వివరాలతో నివేదిక అందించాలని సూచించారు. 25-30 సంవత్సరాల వరకు మాస్టర్ ప్లాన్ తయారుచేయాలన్నారు. వైకుంఠధామాలకు ప్రహరీ, గేటు, ప్లాంటేషన్, మూత్రశాలలు, బట్టలు మార్చుకునే గదులు, నీటి వసతి, విద్యుత్ సరఫరా ఉండాలని తెలిపారు. మున్సిపల్ పరిధిలో చేపట్టే ట్రీ పార్క్, నర్సరీ, అంతర్గత మార్కెట్ యార్డుల పనులను పట్టణ ప్రగతిలో భాగంగా త్వరగా పూర్తిచేయాలని ఆదేవించారు. సమావేశంలో మంచిర్యాల, నస్పూర్, క్యాతనపల్లి, లక్షెట్టిపేట, చెన్నూర్, మందమర్రి, బెల్లంపల్లి మున్సిపాలిటీల కమిషనర్లు, కలెక్టరేట్ భూ సేకరణ అధికారి రజినీ, తహసీల్దార్ సంతోష్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- మహేష్ ఫిట్నెస్ గోల్స్.. వీడియో వైరల్
- ‘కొవిడ్ నెగెటివ్’ నిబంధన ఎత్తేసిన పూరీ జగన్నాథ్ ట్రస్ట్
- శాకుంతలం చిత్రంపై గాసిప్స్.. క్లారిటీ ఇచ్చిన గుణశేఖర్
- పాతబస్తీలో పేలిన సిలిండర్.. 13 మందికి గాయాలు
- అరుణాచల్‌ప్రదేశ్ మాజీ గవర్నర్ కన్నుమూత
- ఈ రాశులవారికి.. ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి
- యువత సమాజానికి ఉపయోగపడాలి
- బాధితులకు జడ్పీ చైర్మన్ పరామర్శ
- శిక్షణను సద్వినియోగం చేసుకోండి
- స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం