శనివారం 28 నవంబర్ 2020
Mancherial - Nov 22, 2020 , 00:13:39

ఓటరు నమోదుకు ప్రత్యేక శిబిరాలు

ఓటరు నమోదుకు ప్రత్యేక శిబిరాలు

  • మంచిర్యాల కలెక్టర్‌ భారతీ హోళికేరి

హాజీపూర్‌ : భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటరు నమోదుకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు మంచిర్యాల కలెక్టర్‌ భారతీ హోళికేరి తెలిపారు. ఫొటో ఎలక్ట్రోరల్‌ రోల్‌ ఎన్‌ఎన్‌ ఆర్‌-2021లో భాగంగా ఈ నెల 21,22న డిసెంబర్‌ 5,6 తేదీల్లో ప్రత్యేక శిబిరాలు ఉంటాయని వివరించారు. శనివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాలను కలెక్టర్‌ సందర్శించారు. 18 ఏళ్లు నిండిన వయోజనులతో పాటు దివ్యాంగులు ఓటు హక్కు నమోదు చేసుకునేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. నిర్ణీత తేదీల్లో బీఎల్వోలు ఉదయం 10 గంటలకు విధు ల్లో ఉండాలని,  సంబంధిత సూపర్‌వైజర్లు పర్యవేక్షించాలన్నారు. ఒక్కో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి 10 పోలింగ్‌ కేంద్రాలకు తగ్గకుండా సందర్శించి, నివేదికలను జిల్లా ఎన్నికల అధికారికి అందించాలని సూచించారు. నూతన ఓటర్ల నమోదు, సవరణలు, మృతి చెందిన వారి పేర్లు, రెండు చోట్ల కార్డులు కలిగిన వారి పేర్లు తొలగించాలన్నారు. 

వైకుంఠధామాన్ని త్వరగా   పూర్తి చేయాలి  

జన్నారం : శ్మశాన వాటిక నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని మంచిర్యాల కలెక్టర్‌ భారతీ హోళికేరి పేర్కొన్నారు. మండలంలోని మహ్మదాబాద్‌లో సర్పంచ్‌ సునారికారి లక్ష్మణ్‌ విరాళంగా ఇచ్చిన 10 గుంటల భూమిలో వైకుంఠధామం నిర్మాణ పనులకు శనివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఇప్పటికే మండలంలోని అన్ని గ్రామాల్లో శ్మశాన వాటిక పనులు పూర్తి కావస్తున్నాయన్నారు. ఇక్కడ డంప్‌ యార్డ్‌, శ్మశాన వాటిక పనులను త్వరగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, డీఆర్డీవో శేషాద్రి, తహసీల్దార్‌ పుష్పలత, ఎంపీడీవో అరుణారాణి, ఎంపీటీసీ కొంతం శంకరయ్య, ఎంపీవో రమేశ్‌ పాల్గొన్నారు.