మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : స్థానిక ఎన్నికల న గారా మోగడంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లో మండల కేంద్రాలు గ్రామా ల్లో ఎన్నికల వేడి రాజుకుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ వెనువెంటనే సర్పంచ్ పదవులకు ఎన్నికలు నిర్వహిస్తుం డడంతో ఒక్కసారిగా ఎన్నికల కోలాహలం మొదలైంది. 2023 డిసెంబర్లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ 2024లోనే స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా ప్రజా వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని వా యిదా వేస్తూ వచ్చింది. ఈలోపు ఎన్నికల ముందు ఇచ్చిన ప్రధాన హామీలో భా గంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు చ ట్టబద్ధంగా కల్పిస్తామని వాగ్దానం చేసి ంది.
అయితే రిజర్వేషన్ల వ్యవహారంలో చిక్కు ముడులు ఉండడంతో ప్రభుత్వం డైలామాలో పడింది. చివరకు పార్టీ ప రంగా 42శాతం బీసీలకు కేటాయిస్తామని ప్రకటించింది. చివరకు అధికారం లో ఉండి 42శాతం రిజర్వేషన్లపై చట్టబద్ధత లేకుండానే జీవో జారీ చేసి చేతులు దులుపుకొన్నది. ఈ లోపు ఎన్నికల షె డ్యూల్ విడుదల చేయడంతో ఇక అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా లో బీఆర్ఎస్కు అధికార కాం గ్రెస్ పార్టీపై ఉన్న వ్యతిరేకత కలిసి రాను ంది. అంతేకాకుండా స్థానికంగా గెలుపొందిన ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ వైపు మెజారిటీ స్థాయిలో ఉన్నారు.
ఈ ఎన్నికల్లో కూడా విజయంపై గులాబీ శ్రేణులు ధీమాతో ఉన్నారు. ఇంకా ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు గుప్పించి అధికారం వచ్చాక అమలు చేయకుండా చేతులెత్తేసిన కాంగ్రెస్ ఎన్నికల్లో ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుంది. ఈలోపు యూ రియా కొరతతో ఆ పార్టీపై రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇక బీజేపీకి గ్రామస్థాయిలో అంత పట్టు ఉండక పోవడంతో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొత్తంమీద ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో స్థానిక ఎన్నికల సమరం మొదలైంది.
ఉమ్మడి పాలమూరు జల్లాలోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లా లో బలమైన అభ్యర్థులను రంగంలో దించేందుకు అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. రిజర్వేషన్లు ఖరారు చేసి 48 గంటలు కూడా గడవకముందే సర్కార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ పదవులకు రిజర్వేషన్ ప్రకారంగా అభ్యర్థులను నిలబెట్టేందుకు కసరత్తు ప్రారంభించారు.
అనేక గ్రామాల్లో మండల కేంద్రాల్లో పోటీకి సై అన్న చాలామంది అభ్యర్థులు రిజర్వేషన్ల ప్రకటనలో డీలా పడిపోయారు. ఎంపీటీసీగా గెలిచి ఎంపీపీలుగా అవుతామని కలలుగన్న చాలామంది నేతల ఆశలు రిజర్వేషన్లను చూసి అవాక్కవుతున్నారు.సర్పంచ్ పదవులు కూడా అదే రకంగా రిజర్వేషన్లు రావడంతో చాలామంది నేతల రాజకీయ భవిష్య త్ ప్రశ్నార్థకంగా మారింది. అయి తే ఆయా పార్టీలు రిజర్వేషన్లకు అనుగుణంగా అభ్యర్థులను రంగ ంలో దింపేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ఐదు జెడ్పీ స్థానాలు మహిళలకు రిజర్వ్ కావడంతో ఆశలు పెట్టుకున్న చాలామంది నేతలు సతీమణులను రంగంలో దింపాల్సిన పరిస్థితి ఏర్పడింది. జోగుళాంబ గద్వాల జిల్లాలో ప్రతిష్టాత్మకమైన జెడ్పీ చైర్మన్ పదవి ఈసారి షెడ్యూలు కులాలకు కేటాయించారు.
ఈ జిల్లాలో పార్టీ మారిన ఎమ్మెల్యే ఒకవైపు.. అధికార పగ్గాలు త మకే ఉండాలని ఆ పార్టీలోని ఒక మహిళా నా యకురాలు మధ్య పోరు నడుస్తోంది. దీంతో ఇక్కడ వ్యూహాత్మకంగా షెడ్యూలు కులాలకు జెడ్పీ చైర్మన్ పదవిని రిజర్వు చేయడంతో తమ కు అనుకూలమైన వ్యక్తులను నిలబెట్టే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే వర్గం భావిస్తోంది. ఇక మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల జెడ్పీ స్థానాలు బీసీ మహిళలకు కేటాయించారు. నారాయణపేట జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కూడా జనరల్ మహిళకు కేటాయించారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని ఐదు జె డ్పీ పీఠాలు మహిళలకే దక్కనున్నాయి.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో గత ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో దాదాపు 85 శాతం వరకు పదవులను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అంతేకాకుండా ఐదు జెడ్పీల్లోనూ గులాబీ జెండాను ఎగరేసిం ది. ఎంపీపీలో కూడా మెజారిటీ మండలాలను కైవసం చేసుకుంది. సర్పంచ్ స్థానాల్లో దాదాపు 90 శాతం వరకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు గెలిచారు. ఆ తర్వాత అధికారం కోల్పోయిన స్థానిక ప్రజాప్రతినిధులు చాలామంది అధికార పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా పార్టీ మారలేదు.
కొన్నిచోట్ల మున్సిపాలిటీలో మారినా.. గ్రామీణ స్థాయిలో మాత్రం బీఆర్ఎస్ వైపే ఉన్నారు. దీంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవిని అనూహ్యంగా బీఆర్ఎస్ చేజిక్కించుకుంది. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కాకముందే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం సొంత జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమిని చవిచూసింది. ఈ నేపథ్యంలో ఈసారి కూడా అదే ట్రెండ్‌ను ఫాలో కావాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీని గట్టిగా ఢీకొనేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఉమ్మడి జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిందని ఆయా జిల్లా కలెక్టర్లు పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో కోడ్ ఆఫ్ కండక్ట్ సోమవారం నుంచి అమల్లోకి వస్తుందన్నారు. అక్టోబర్ 9న స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతున్నది. రెండు విడుతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి. మూడు విడుతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారు. అక్టోబర్ 23, 27న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ఉంటుంది. అక్టోబర్ 31, నవంబర్ 4, 8 తేదీల్లో పం చాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహిం చి అదే రోజు పంచాయతీ ఎన్నికల ఫలితాలు విడుదల చేస్తారు. అయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు నవంబర్ 11న వెలువడుతాయని ఎన్నికల కమిషన్ పేర్కొన్నది.
ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపకుండా వాయిదాలు వేస్తూ వచ్చింది. బీసీలకు 42 శాతం రిజ ర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఇచ్చి ఆ తర్వాత మోసం చేసింది. ప్రస్తుతం ఉట్టి జీవోను మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకొంది. కాంగ్రెస్ పార్టీలోనూ బీసీలకు 42శాతం టికెట్లు ఇస్తారన్న గ్యారె ంటీ కూడా లేదు. ప్రభుత్వం కావాలని స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించ రాదని ఉద్దేశంతో ఉన్నట్లు స్పష్టం అవుతున్నది. ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ ఉమ్మడి జిల్లాలో మళ్లీ మెజారిటీ స్థానాలు దక్కించుకుంటుంది. 12 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ సత్తా ఏమిటో చూపిస్తాం. ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్, బీజేపీలో లోపాయికారి ఒప్పందానికి దిగుతున్నాయి. ప్రజలు, రైతులు, బీసీలు దళితులు స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకి బుద్ధి చెప్పడం ఖాయం.
– వీ.శ్రీనివాస్‌గౌడ్, మాజీ మంత్రి