ధాన్యం పైసల్ ₹50 కోట్లు పెండింగ్
వనపర్తి జిల్లాలో ఎట్టకేలకు యాసంగి ధాన్యం కొనుగోళ్లు అష్టకష్టాల మీద ము గిశాయి. రైతుల అగచాట్ల మధ్య.. అనేక ఒడిదుడుకులతో అయ్యిందనిపించారు. జిల్లాలో మొత్తం 3.50 లక్షల మెట్రిక్ ట న్నుల ధాన్యం లక్ష్యంగా పెట్టుకున్నా.. పౌరసరఫరాల శాఖ చివరకు రెండున్నర లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేసింది. ఇంత వరకు బాగానే ఉ న్నా.. కొనుగోలు చేసిన రైతులకు దా దాపు నెల రోజులైనా ధాన్యం డబ్బులు అందకపోవడం విచారకరం.
- ఐకేపీ సెంటర్ల నిర్వాహకుల నిర్లక్ష్యం
- వరి కొనుగోళ్ల వివరాలు ట్యాబ్‌ల్లో ఎంట్రీ చేయని వైనం
- రికార్డుల్లోకి ఎక్కని 20 వేల మెట్రిక్ టన్నులు
- నెల రోజులుగా రైతుల ఎదురుచూపు
- పట్టించుకోని అధికార యంత్రాంగం
వనపర్తి, జూలై 3 (నమస్తే తెలంగాణ) : వనపర్తి జిల్లాలో ఎట్టకేలకు యాసంగి ధాన్యం కొనుగోళ్లు అష్టకష్టాల మీద ము గిశాయి. రైతుల అగచాట్ల మధ్య.. అనేక ఒడిదుడుకులతో అయ్యిందనిపించారు. జిల్లాలో మొత్తం 3.50 లక్షల మెట్రిక్ ట న్నుల ధాన్యం లక్ష్యంగా పెట్టుకున్నా.. పౌరసరఫరాల శాఖ చివరకు రెండున్నర లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేసింది. ఇంత వరకు బాగానే ఉ న్నా.. కొనుగోలు చేసిన రైతులకు దా దాపు నెల రోజులైనా ధాన్యం డబ్బులు అందకపోవడం విచారకరం. యాసంగిలో భారీ ఎత్తున వరిని సాగుచేసిన రై తులు ధాన్యం అమ్ముకోవడంలో నానా తంటాలు పడక తప్పలేదు. అయితే జి ల్లాలోని పలు మండలాల్లో ధాన్యం డ బ్బులు చెల్లించలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖాతాల్లో వేగంగా డ బ్బులు జమ చేస్తామని ప్రభుత్వం చెబుతున్న క్రమంలో కింది స్థాయిలో కొనుగోళ్లకు సంబంధించిన వివరాలు రికార్డు చేయడంలో ఐకేపీ కేంద్రాల నిర్వాహకు ల నిర్లక్ష్యం కారణంగా డబ్బుల చెల్లింపు ప్రక్రియ ముందుకు సా గడం లేదు.
ఐకేపీ సెంటర్లోనే నిర్లక్ష్యం..
జిల్లాలో 300కుపైగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వరి ధాన్యం కొనుగోళ్లను నిర్వహించారు. ప్రతిసీజన్‌లో పీఏసీసీఎస్, ఐకేపీ, మెప్మా పరిధిలో వీటిని యథావిధిగా ఏర్పాటు చేస్తూ వ స్తున్నారు. అయితే మూడు మండలాలు మినహా మిగితా మండలాల్లో పీఏసీసీఎస్, ఐకేపీ సెంటర్లు గ్రామాల వారీగా ఏర్పాటు చేశారు. పాన్‌గల్, వీపనగండ్ల, చిన్నంబాయి మండలాల్లోనే కేవలం ఐకేపీ సెంటర్లను మాత్రమే ప్రారంభించి కొనుగోళ్లను జరిపించారు. ఎవరు కొనుగోలు చేసినా సకాలంలో జరగాల్సిన పనులు రైతులకు జరిగితే సమస్య రాదు. ఈ మూడు మండలాల్లోనే అత్యధికంగా డబ్బులు పడని రైతులు ఉన్నా రు. రైతుల కొనుగోలుకు సంబంధించిన వివరాలను ట్యాబ్ ఎంట్రీలు చేయక పోవడం, చేసిన వాటిలోనూ తప్పులుండడం వల్ల రైతులకు ఇబ్బందులను తెస్తున్నాయి. దాదాపు వెయ్యి మంది వరకు డబ్బులు అందాల్సిన రైతులు ఉంటే, 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వివరాలను ట్యాబ్‌ల్లో ఎంట్రీలు చేయాల్సి ఉన్నది.
బిల్లుల చెల్లింపులు పెండింగ్..
వరి ధాన్యం విక్రయాలు జరిపిన రైతులకు ప్రభుత్వం నుంచి డబ్బులు సకాలంలో రావడం లేదు. ఇలా అమ్మి అలా డబ్బులు తీసుకోండని సర్కార్ హామీకి కారణాలేమైనా కోట్లాది రూపాయలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పరిస్థితిలో ధాన్యం విక్రయించి నెల రోజులైనా డబ్బులు పడడం లేదంటే అర్థమవుతున్నది. వానకాలం సీజన్ నెల రోజులు గడిచినప్పటికీ అన్నదాతలకు గడ్డు పరిస్థితులున్నాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు రూ.50 కోట్లు రైతుల అకౌంట్లలో జమ కావాల్సి ఉంది. అయితే.. డబ్బులు పౌరసరఫరాల శాఖ పరిధిలో ఉన్నప్పటికీ రైతులకు మాత్రం చేరడం లేదు. ధాన్యం అమ్మిన అనంతరం ఆ కేంద్రం ద్వారా రావాల్సిన సమాచారం పౌరసరఫరాల శాఖకు చేరకపోవడంతో డబ్బులు పడడం లేదు. ఆయా కేంద్రాలు, రైస్ మిల్లర్ల ద్వారా జిల్లా కేంద్రానికి రైతుల ధాన్యం వివరాల ధ్రువీకరణలు అందకపోవడం వల్ల కూడా బిల్లుల చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయి. ముఖ్యంగా ఆయా శాఖల మధ్య సమన్వయం లేక రైతులకు డబ్బులుండీ కూడా సమయానికి వారి అకౌంట్లలో జమ చేయలేని దుస్థితిని రైతులు ఎదుర్కొంటున్నారు.
డబ్బులు రాలేదు..
నెల రోజులుగా దాన్యం విక్రయించిన డబ్బుల కోసం ఎదురు చూస్తున్నాం. 15 రోజుల కిందట వడ్లు ఐకేపీ సెంటరులో 65 బస్తాలు తూకం వేసుకున్నారు. తీరా 56 బస్తాలు మాత్రమే తీసుకెళ్లి మిగిలినవి వదిలేశారు. డబ్బులు ఎన్ని బస్తాలకు ఇస్తారో అర్థం కావడం లేదు. ఈ యాసంగి సీజన్లో చాలా నిర్లక్ష్యంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగింది. ఎప్పుడు ఇలా కాలేదు. వానకాలం వచ్చినా డబ్బులు ఇవ్వకుంటే పెట్టుబడి కోసం ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ప్రభుత్వం వెంటనే డబ్బులు అకౌంట్లలో జమ చేయాలి.
– బీ.శేఖర్‌గౌడ్, రైతు, గోవర్ధనగిరి, వీపనగండ్ల మండలం
రెండ్రోజుల్లో క్లియర్ చేస్తాం
వనపర్తి జిల్లాలో రైతులకు ధాన్యం డబ్బు లు ఇవ్వాల్సి ఉంది. కొనుగోళ్లకు సంబంధించిన వివరాలు ట్యాబ్‌లో ఎంట్రీ కానందునే
కొంత ఆలస్యమవుతున్నది. ఈ ప్రక్రియ వేగవంతానికి చర్యలు తీసుకుంటున్నాం. పెండింగ్ ఉన్న ప్రాంతాల్లోని సిబ్బందితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తాం. మరో రెండు రోజుల్లో ఎలాంటి పెండింగ్ లేకుండా పూర్తి చేస్తాం. సోమవారం వరకు రైతులందరికీ వారి అకౌంట్ల లో డబ్బులు జమ అవుతాయి.
– ఎన్.ఆంజనేయులు, డీఎం, వనపర్తి జిల్లా పౌరసరఫరాల శాఖ
నెలరోజులుగా ఎదురు చూస్తున్నాం
యాసంగిలో ఐదు ఎకరాలో వరి సాగు చేశా.. 417 బస్తాలు ఐకేపీ సెంటర్లో తూకం చేసుకున్నారు. నెల రోజులు దాటింది. అయినా ఇప్పటి వరకు ఎలాంటి స మాచారం లేదు. ఎన్ని సార్లు అడిగినా డబ్బులు పడతాయి అని చెబుతున్నారు కానీ అకౌంట్లో జమకావడం లేదు. ఇన్ని రోజులు ఎప్పుడు డీలా కాలేదు. ఈసారి ఎక్కువ రోజులు అవుతున్నది. వానకాలం వచ్చినా డబ్బులు రాకుంటే ఎలా? అధికారులు స్పందించి త్వరగా డబ్బులు జమ చేసేందుకు చర్యలు తీసుకోవాలి.
– పెద్ద నర్సింహ, రైతు, పెద్దదగడ, చిన్నంబాయి మండలం
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్‌కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

