చేతికొచ్చిన పంట ఎండిపాయే..
‘ఎకరా పొలంలో కష్టపడి వరి సాగు చేసిన.. ఎండాకాలంలో ఇబ్బందులు తప్పవని ముందుగానే ఊహించి త క్కువగా సాగు చేశా.. నాటేసిన రెండు నెలల త ర్వాత బోరులో నీరు పూర్తిగా అడుగంటింది.. పంట చేతికొచ్చే సమయంలోనే ఎండిపా యే.. ఉన్న బోరులో నీళ్లు రావడం లేదు.. దీంతో ఎలాగైనా పం టను కాపాడుకోవాలని 8 రోజుల కిందట రెండు బోర్లు మళ్లా వే శా. ఒక్కో బోరు 200 ఫీట్లకుపైగా డ్రిల్ చేయించినా.
- ఉన్న బోరు వట్టిబోయే.. మళ్లా రెండు బోర్లు డ్రిల్ చేయిస్తే నీళ్లురాలే..
- కాంగ్రెస్ సర్కారులో ఇంత కరువు చూస్తమనుకోలే..
- నవాబ్పేట మండలం సిద్ధోటం రైతు తిమ్మగళ్ల వీరస్వామి ఆవేదన
నవాబ్పేట, ఏప్రిల్ 5 : ‘ఎకరా పొలంలో కష్టపడి వరి సాగు చేసిన.. ఎండాకాలంలో ఇబ్బందులు తప్పవని ముందుగానే ఊహించి త క్కువగా సాగు చేశా.. నాటేసిన రెండు నెలల త ర్వాత బోరులో నీరు పూర్తిగా అడుగంటింది.. పంట చేతికొచ్చే సమయంలోనే ఎండిపా యే.. ఉన్న బోరులో నీళ్లు రావడం లేదు.. దీంతో ఎలాగైనా పం టను కాపాడుకోవాలని 8 రోజుల కిందట రెండు బోర్లు మళ్లా వే శా. ఒక్కో బోరు 200 ఫీట్లకుపైగా డ్రిల్ చేయించినా.
రెండింట్లో చుక్క నీరు రాలే. పంట సాగుకు రూ.40 వేలు అప్పు చేశా. బోర్లేసేందుకు మళ్లా రూ.70వేలు అప్పు తెచ్చిన. మొత్తం కలిసి 1.10 లక్షలైంది. కేసీఆర్ సర్కారులో 10 ఏండ్లు ఎంతో సంతోషంగా పం టలు పండించినం అంటూ సిద్ధోటం గ్రామానికి చెందిన దళిత రైతు తిమ్మగళ్ల వీరస్వామి ఆందోళన చెందుతున్నాడు.
కన్నీటి సాగు
- ఎండిపోయిన కూరగాయలు
- పశువుల మేతకు వదిలేసిన రైతులు
హన్వాడ, ఏప్రిల్ 5 : యాసంగి పంటల సాగు రైతులకు కన్నీళ్లను మిగుల్చుతున్నది. ఓవైపు కరెంట్ సమస్యలు.. మరోవైపు సాగునీటి కష్టాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. దీంతో ప్రస్తుతం చేతికొచ్చిన వరి, ఇతర పంటలు ఎండిపోతుండగా.. ప్రస్తుతం కూరగాయల తోటలు సైతం దెబ్బతింటున్నాయి. హన్వాడ మండలంలో పెద్ద ఎత్తున రైతులు కూరగాయలు సాగు చేస్తుంటారు.
అయితే ఈసారి సాగునీళ్లు అందక చివరి దశలో ఉన్న పంటలు చేతికందే పరిస్థితులు లేవు. హన్వాడ శివారులో రైతు యాదయ్యకు చెందిన టమాట, వంకాయ పంటల ఎండిపోవడంతో మూగజీవాల మేతకు వదిలేశాడు. అలాగే బీరకాయ కాయలు పట్టే ముందు నీళ్లు అందని పరిస్థితి. ఇలా మండలంలోని అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి దాపురించిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. పెట్టుబడులకు వేలకు వేలు అప్పులు తెచ్చి పెడితే చేతికొచ్చిన పంట కండ్ల ఎదుటే ఎండిపోతుంటే గుండె చెరువవుతున్నదని అన్నదాతలు వాపోతున్నారు. ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

