వనపర్తి, మార్చి 19 (నమస్తే తెలంగాణ) : వనపర్తి జిల్లాలో 33/11 కేవీ సబ్స్టేషన్ల పనులు పెండింగ్ పడ్డాయి. దాదాపు రెండేళ్లకుపైగా ఈ పనులు ము ందుకు సాగడం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరైన సబ్స్టేషన్లు సైతం ఇంకా పూర్తి కాలేదు. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినా మరికొన్ని పనులు కూడా మొదలు కాలేదు. ఇలా జిల్లా వ్యాప్తంగా దాదాపు 20 సబ్స్టేషన్ల పనులు అటకెక్కాయి. ఇలా రెండు, మూడు, చివరకు నాలుగేళ్లుగా జిల్లాలో పూర్తి చేయని సబ్స్టేషన్లతో విద్యుత్‌శాఖ సతమతమవుతున్నది.
ఏసీబీ దాడులతో కొంత కలవర పాటుకు గురైన విద్యుత్ శాఖ తిరిగి ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది. వనపర్తి జిల్లాకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం విరివిగా సబ్స్టేషన్లను మం జూరు చేసింది. రైతులకు లోవోల్టేజీ సమస్యను ఎదురవ్వకుండా అధిగమించడం కోసం వీటిని మంజూరు చేశారు. అయితే.. జిల్లాలో ఒక 400 కేవీ సబ్‌స్టేషన్ ఉంటే, మరో రెండు 220 కేవీ, ఇంకో రెండు 133 కేవీ సబ్స్టేషన్లు ఉన్నాయి. ఇక 33/11కేవీ సబ్స్టేషన్లు 102 వరకు పని చేస్తున్నా యి. వీటి ద్వారా అత్యధికంగా వ్యవసాయరంగానికి కరెంట్ అందుతుంది. ప్రధానంగా వేసవిలో లోవోల్టోజీ సమస్య ఉత్పన్నమవుతోంది. ఇలా లో వోల్టేజీ ద్వారా చిన్న ట్రాన్స్ఫార్మర్లు, అలాగే వ్యవసాయ మోటర్లు కాలిపోవడం సాధారణం. వీటికం తా సబ్స్టేషన్ల నుంచి తగినంత నాణ్యమైన కరెంట్ సరఫరా జరిగితే ఈ సమస్య ఉత్పన్నం కాదు.
20 సబ్స్టేషన్లు పెండింగ్..
జిల్లా పరిధిలో వివిధ మండలాల్లో 33/11 కేవీ సబ్స్టేషన్లు అనేకం పెండింగ్‌లో ఉన్నాయి. ఏండ్ల తరబడి ఈ పనులు ముందుకు సాగకపోవడంతో లోవోల్టేజీ సమస్య రైతులను వేధిస్తున్నది. పనులన్నీ పూర్తి చేసుకొని వినియోగంలోకి రావాల్సిన సబ్స్టేషన్లు పెండింగ్‌లో ఉండడం ఇబ్బందిగా మా రింది. ఒక్కో సబ్‌స్టేషన్‌కు ఒక్కో సమస్య అన్నట్లుగా ఉన్నది. కొన్ని స్థల సమస్యలను ఎదుర్కొంటే, మరి కొన్నింటిలో కాంట్రాక్టర్ సమ స్య, ఇంకోచోట మెటీరియల్ సమస్యలు ఎదురవ్వడంతో పనులు పెండింగ్‌లో ఉన్నాయి. దాదాపు 20 సబ్స్టేషన్లు పెం డింగ్‌లో ఉండడం చూస్తే.. విద్యుత్ విభాగంలో జరుగుతున్న పనుల తీరు అర్థమవుతున్నది.
సమన్వయం ఎక్కడ?
వనపర్తి జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున సబ్‌స్టేషన్ పనులు ఏండ్ల కొద్ది పెండి ంగ్ పడినా వివిధ శాఖలు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఒకటి కాదు, రెండు కాదు, నాలుగేళ్లుగా పనులు జరగని సబ్స్టేషన్లు ఉన్నాయి. వివిధ కారణాలతో పనులు జరగడం లేదు. విద్యుత్, రెవెన్యూ శాఖల సమన్వయం కూ డా గందరగోళంగా ఉన్నది. చాలా చోట్లా స్థల సమస్యలు ఉన్నాయి.
కొన్ని చోట్ల స్థలా లు కేటాయించినా అవి సక్రమంగా లేవు. ఇంతలా పెండింగ్ ఉన్న సబ్ స్టేషన్లపై ప్రజాప్రతినిధుల దృష్టి కూడా అంతంత మాత్రమే ఉన్నది. పైపైనే ఏదో సమీక్ష జరపడం తప్పా.. రైతులకు ప్రయోజనం కలుగడం లేదు. ఇప్పటికైనా అధికార యంత్రాంగంలో కదలిక వస్తుందా? లేదా? అన్నది చూడాలి. ఈ సబ్‌స్టేషన్ పనులన్నీ పూర్తయితే.. జిల్లాలో చాలా వరకు లోవోల్టేజీ సమస్య తొలగిపోతున్నది.
పక్క కనిపిస్తున్న ఫొటోలోని 33 కేవీఏ సబ్‌స్టేషన్ పనులకు 20 జూలై 2022న నాటి మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వనపర్తిలో శంకుస్థాపన చేశారు. కొంత వరకు పనులు బాగానే జరిగాయి. మధ్యలో కాంట్రాక్టర్ సమస్య వచ్చి పనులు పూర్తిగా నిలిచిపోయాయి. జిల్లా కేంద్రంలో ఎలాంటి లోవోల్టేజీ సమస్య ఉండకూడదని అప్పట్లో విరివిగా మాజీ మంత్రి సబ్స్టేషన్లను మంజూరు చేయించారు. ఇందులో భాగంగానే వనపర్తి తాసీల్దార్ కార్యాలయం పక్కన నూతన సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన చేసి పనులు మొదలెట్టారు. ఇలా ఏడాదికిపైగా అర్ధాంతరంగా నిలిచిన సబ్‌స్టేషన్‌ను విద్యుత్‌శాఖ అధికారులు కాంట్రాక్టర్ పేరు చెప్పి వదిలేశారు. పూర్తి చేయాల్సిన బాధ్యత ఉన్నా నిండు నిర్లక్ష్యంతో పట్టించుకోలేదు. ఇలా పనులకు శంకుస్థాపన జరిగి దాదాపు ఐదేండ్లు గడుస్తున్నా అసంపూర్తిగానే మిగిలిపోయాయి.
పక్క చిత్రంలో కనిపిస్తున్న శిలాఫలకం వీపనగండ్ల మండలం పుల్గర్చెర్లలో 33/11 కేవీ సబ్‌స్టేషన్ కోసం ఎక్సైజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు. 2025న జూన్1వ తేదీన చేపట్టిన ఈ సబ్‌స్టేషన్ నిర్మాణ శంకుస్థాపన జరిగి 9 నెలలు కావచ్చింది. అయితే.. శిలాఫలకం మాత్రం కల్వరాల సబ్‌స్టేషన్‌లో విద్యుత్ అధికారులు భద్రపరిచారు. పనులు మాత్రం ఇంతవరకు ప్రాథమికంగా కూడా చేపట్టలేదు.. సరికదా.. ఇప్పటికీ స్థల సమస్యను ఎదుర్కొంటున్నది. రైతుల లోవోల్టేజీ సమస్యను అధిగమించడం కోసం చేపట్టిన పనులు ఇలా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దీంతో అన్నదాతలతోపాటు ప్రజ లు ఆందోళన చెందుతున్నారు.
20 సబ్స్టేషన్లు పెండింగ్..
జిల్లా పరిధిలో వివిధ మండలాల్లో 33/11 కేవీ సబ్స్టేషన్లు అనేకం పెండింగ్‌లో ఉన్నాయి. ఏండ్ల తరబడి ఈ పనులు ముందుకు సాగకపోవడంతో లోవోల్టేజీ సమస్య రైతులను వేధిస్తున్నది. పనులన్నీ పూర్తి చేసుకొని వినియోగంలోకి రావాల్సిన సబ్స్టేషన్లు పెండింగ్‌లో ఉండడం ఇబ్బందిగా మారింది. ఒక్కో సబ్‌స్టేషన్‌కు ఒక్కో సమస్య అన్నట్లుగా ఉన్నది. కొన్ని స్థల సమస్యను ఎదుర్కొంటే, మరి కొన్నింటి లో కాంట్రాక్టర్ సమస్య, ఇంకోచోట మెటీరియల్ సమస్యలు ఎదురవ్వడంతో పనులు పెండింగ్‌లో ఉన్నాయి. దాదాపు20 సబ్స్టేషన్లు పెండింగ్‌లో ఉండడం చూస్తే.. వి ద్యుత్ విభాగంలో జరుగుతున్న పనుల తీరు అర్థమవుతున్నది.
ఏఎస్సైనంటూ.. రూ. 49 వేలు కాజేసి..
కోడేరు, మార్చి 19 : ఏఎస్సై నంటూ సైబర్ నేరగాళ్లు మహిళ నుంచి నగదు కాజేసిన ఘటన కోడేరులో చోటు చేసుకున్నది. ఎస్సై వేణుగోపాల్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. గురువారం కోడేరుకు చెందిన మహిళకు వచ్చిన ఫోన్లో తాను కోడేరు ఏఎస్సై అని.. తాను దవాఖానలో ఉన్నానని.. అత్యవసరంగా డబ్బులు కావాలని డిమాండ్ చేశాడు. ఫోన్‌పే లేదా గూగుల్‌పే ద్వారాడబ్బులు వేస్తే నగదు రూపంలో చెల్లిస్తానంటూ సదరు మహిళలను నమ్మబలికాడు. అతడి మాటలు నమ్మి రూ.49 వేలు ఫోన్‌పే చేసింది. తర్వాత ఫోన్ చేయగా.. నెంబర్ మనుగడలో లేకపోవడంతో తాను సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించింది.
కేటీఆర్‌కు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఆల
బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు దేవరదక్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గురువారం తెలంగాణ భవన్లో ఉగాది పండుగను పురస్కరించుకొని నిర్వహించిన పూజల్లో కేటీఆర్‌తో పాటు ఆల పాల్గొన్నారు.
– మూసాపేట, మార్చి 19
చర్యలు తీసుకుంటాం
కొన్ని సబ్‌స్టేషన్ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. సరైన స్థలాలు లేక పనులు మొదలు కాలేదు. రెవెన్యూ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. మరికొన్ని చోట్ల కాంట్రాక్టర్ల సమస్య
ఉన్న వాటిని గుర్తించి పూర్తి చేయిస్తాం. లోవోల్జేజీ సమస్య నివారణ కోసమే సబ్స్టేషన్ల ఏర్పాటు జరుగుతుంది. వీలైనంత తొందరలోనే
పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తాం.
– తిరుపతిరావు, ఎస్ఈ విద్యుత్ శాఖ, వనపర్తి జిల్లా
లోవోల్టోజీ సమస్య తీరుతుందనుకున్నాం..
సబ్‌స్టేషన్ ఏర్పాటైతే లోవోల్టేజీ సమస్య తీరిపోతుందని ఆశపడ్డాం. రైతులకు మోటర్లు కాలిపోవడం ఇక ఉండదనుకున్నాం. కానీ శంకుస్థాపన జరిగి ఏడాది కావస్తున్నా.. ఒక్క అడుగు పని కూడా జరగలేదు. స్థల సమస్య అంటున్నా.. ఇంత వరకు పరిష్కారం కాలేదు. ఇప్పటికైనా అధికారులు వెంటనే సబ్‌స్టేషన్ పనులు చేపట్టాలి. వచ్చేది ఎండాకాలం లోవోల్టేజీ తీవ్రంగా ఉంటుంది. అధికారులు చొరవ తీసుకోవాలి.
– బాబురెడ్డి, రైతు, పుల్గర్చెర్ల, వీపనగండ్ల మండలం
రూం కట్టి వదిలేశారు..
అజ్జకొల్లులో సబ్‌స్టేషన్ పనులను మొదలెట్టి రెండేళ్లు దాటింది. కేవలం ఒక రూం కట్టి వదిలేశారు. ఎప్పుడు పూర్తి చేస్తారో అర్థం కావడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లయినా పనులు జరగడం లేదు. రైతుల వసతి కోసం మంజూరు చేసిన సబ్‌స్టేషన్ ఇప్పటి వరకు పెండింగ్‌లోనే ఉన్నది. ఎవరూ పట్టించుకోవడం లేదు. అధికారులు చొరవ తీసుకుని అజ్జకొల్లులో పెండింగ్ పడిన సబ్‌స్టేషన్‌ను పూర్తి చేయాలి.
– కృష్ణయ్య, అజ్జకొల్లు, మాజీ జెడ్పీటీసీ, మదనాపురం, వనపర్తి జిల్లా
