తిమ్మాజిపేట, ఆగస్టు 23 : తాగునీటి కోసం పదేండ్లుగా కనబడని ఖాళీ బిందెలతో కుస్తీ మళ్లీ కాంగ్రెస్ పాలనలో ఆవిష్కృతమైంది. నాలుగు రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా కాకపోవడంతో తిమ్మాజిపేట మండలం చేగుంట రోడ్డుపై శుక్రవారం మహిళలు, ప్రజలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. సమస్యను చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళల నిరసన తెలుసుకున్న అధికారులు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టారు. ఈ విషయమై ఆర్డబ్ల్యూఎస్ ఇన్చార్జి ఏఈ మద్దిలేటిని వివరణ కోరగా, పైల్లైన్ లీకేజీతో గ్రామానికి సరఫరా అయ్యే చోట కొందరు మోటర్లు బంద్ చేశారని తెలిపారు. గతంలో గుమ్మకొండలో కూడా పైప్లైన్ లీకేజీతో రెండు రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయిందన్నారు.