దేవరకద్ర రూరల్ (కౌకుంట్ల), జనవరి 26 : సారూ మాకు గూడు లేదు.. రేషన్ లేదు.. మాలాంటోళ్లకు ఇందిరమ్మ ఇల్లు, రేషన్‌కార్డు కల్పించి ఆదుకోవాలని అడిగిన పాపానికి.. మమ్మల్నే ప్రశ్నిస్తారా? మీకు ప్రభుత్వ పథకాలు రానివ్వమంటూ ప్రజలకు జవాబుదారిగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులే బెదిరింపులకు పాల్పడుతున్నారు. కాంగ్రెస్ లీడర్లు.. పా ర్టీకి అనుకూలంగా ఉన్నోళ్లకే పథకాలు అందజేస్తా రా.. ఇలాగైతే మేమంతా దరఖాస్తు చేసుకొని ఏం ప్రయోజనమంటూ దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డిపై మహిళలు నిలదీశారు. కౌకుంట్ల మండ లం తిర్మలాపూర్‌లో ఆదివారం కాంగ్రెస్ సర్కారు నాలుగు పథకాల అమలులో మంజూరైన లబ్ధిదారులకు పత్రాలు అందజేయడానికి ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా అక్కడున్న మహిళలు ఎమ్మెల్యేలు లబ్ధిదారుల ఎంపికపై అభ్యంతరం తెలుపుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన లక్ష్మి తనకు రేషన్‌కార్డు, ఇల్లు లేదని అడుగుతున్న క్రమంలో కాం గ్రెస్ నాయకులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఆ మహిళ నేరుగా ఎమ్మెల్యేను అడుగగా, నీకు ఏ పథకం ఇవ్వమని ఎమ్మెల్యే సమాధానమిచ్చినట్లు ఆవేదన వ్యక్తం చేసింది. ప్రజలకు భ రోసా కల్పించాల్సిన ప్రజాప్రతినిధే పథకాలపై ప్ర శ్నిస్తే బహిరంగంగా మీకు ఇచ్చేది లేదంటూ చెప్పడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. చాలా మం దికి లబ్ధిదారులు అర్హులైనప్పటికీ పథకాలకు నోచుకోలేకపోతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.
ఊట్కూర్, జనవరి 26 : నాలుగు పథకాల అమలులో భాగంగా మండలంలోని కొల్లూరు గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు కింద అధికారులు ఎంపిక చేశారు. ఉన్నతాధికారుల ఆదేశంతో అర్ధరాత్రి ఆదరా బాదరగా లబ్ధిదారులను ఎంపిక చేసిన అధికారులు ఆదివారం మధ్యాహ్నం స్థానిక రైతువేదికలో సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రి సందేశాన్ని ప్రజలకు వినిపించి ప్రొసిడింగ్ పత్రాల పంపిణీ చేపట్టారు. ఈ క్రమంలో గ్రామస్తులు కలుగజేసుకొని గ్రామానికి మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచి ఇబ్బందులు పడుతున్నామని, అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు ఒకే ఒక్క ఉపాధ్యాయుడితో విద్యాభ్యాసం కొనసాగుతుందని, విద్యార్థులు నష్టపోతున్నట్లు తెలిపారు. సమస్యలు చెప్పినా పట్టించుకోరా అంటూ అధికారులను నిలదీశారు. స్పందించిన ఎంపీడీవో ధనుంజయగౌడ్ నిధుల కొరత కారణంగా సమస్యలను పరిష్కరించలేకపోతున్నామని, వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం తో గ్రామస్తులు శాంతించారు.