జడ్చర్లటౌన్, జూన్ 15 : మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని నేతాజీ చౌరస్తా సమీపంలోని బొవెలకుంట రహదారి పక్కన 3 అంతస్తుల భవనంపై నుంచి దూకి మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. జడ్చర్ల సీఐ కమలాకర్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. జడ్చర్లలోని బోవెలకుంట రహదారి పక్కన ఓ మూడు అంతస్తుల భవనంపై అనూష(30), ఆంజనేయులు దంపతులు అద్దెకు ఉంటున్నారు. వీరికి ముగ్గురు మగ సంతానం. పట్టణంలోని ఓ ప్రైవేట్ దవాఖానలో నర్సుగా పనిచేస్తున్న అనూష ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో క్షణికావేశంలో 3 అంతస్తుల పైనుంచి కిం దికి దూకింది.
దీంతో ఆ మె తలకు బలమైన గా యాలు తగలటంతో అక్కడిక్కడే మృతి చెందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చే పట్టి పోస్టుమార్టం ని మిత్తం మృతదేహాన్ని మా ర్చురీకి తరలించారు. మృ తురాలి తల్లి సాయమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కమలాకర్ తెలిపారు. ఇదిలా ఉండగా భార్యాభర్తల మధ్య సంసార విషయంలో గొడవ చోటుచేసుకోవటంతో అనూష భవనంపై నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.