బిజినేపల్లి, ఫిబ్రవరి 3 : అనుమానాస్పదంగా మహిళ మృతిచెందిన ఘటన మండలంలోని మహదేవునిపేటలో సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. మహదేవునిపేటకు చెందిన యాదమ్మ(55)కు కరుణాకర్, పరమేశ్ ఇద్దరు సంతానం. చిన్న కుమారుడు హైదరాబాద్కు వెళ్లడంతో పెద్ద కుమారుడు కరుణాకర్ కూలీ పనులు చేసూకుంటూ ఇంటి వద్ద ఉంటున్నాడు. దీంతో నిత్యం తాగుతూ తిరుగుతుండేవాడు. తల్లి మందలించేది.
ఈ క్రమంలో ఈనెల 2వ తేదీన గ్రామంలోని కృష్ణయ్య ఇంటి వెనకాల దుర్వాసన రావడం తో గమనించిన స్థానికులు శివ, రాములు వెళ్లిచూడగా.. యాదమ్మ చనిపోయినట్లు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి సీఐ కనకయ్య, ఎస్సై శ్రీనివాసులు చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనపై మృతురాలి భర్త ముత్తయ్య తన పెద్ద కుమారుడే కొట్టి చంపి ఉంటాడని అనుమానంతో ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమో దు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.