మహబూబ్‌నగర్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ ప్రతిని ధి) : సమీకృత కలెక్టరేట్ ప్రారంభం కావడంతో మహబూబ్‌నగర్-భూత్పూర్ రహదారికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. నిన్నమొన్నటి వరకు ధర తక్కువగా ఉండగా.., నేడు గజం రూ.30 వేల వరకు పలుకుతున్నది. కలెక్టరేట్ చుట్టుపక్కల భూములన్నింటినీ ఇప్పటికే రియల్ వ్యాపారులు కొనుగోలు చేశారు. ఎంవీఎస్ డిగ్రీ కళాశాల నుంచి పాలకొండ, అమిస్తాపూర్, భూత్పూర్ వరకు రీ సేల్ చేస్తుండడంతో హట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి.
ఎకరా భూమి రూ.కోట్లల్లో పలుకుతున్నది. వెంచర్లకు ఫుల్‌డిమాండ్ ఏ ర్పడింది. బైపాస్ రోడ్డు చుట్టుపక్కల ఉన్న భూములకూ విపరీతమైన డిమాండ్ వచ్చింది. మరోవైపు కమర్షియల్ స్థలాల్లో షాపింగ్‌లకు ప్లాన్ చేస్తున్నారు. కలెక్టరేట్ సమీపంలో స్టార్‌హోటళ్లు ని ర్మించేందుకు హైదరాబాద్‌కు చెందిన వ్యాపారులు ముందుకొస్తున్నట్లు సమాచారం. మహబూబ్‌నగర్ జిల్లాను ముడాలో కలిపేశారు.
క్రిస్టియన్‌పల్లి నుంచి ధర్మాపూర్ జాతీయ రహదారికి అనుసంధానం చేస్తూ త్వరలో బైపాస్ రహదారి పనులు ప్రారంభం అవుతుండడంతో రియల్‌వ్యాపారుల పంట పండుతున్నది. పాలకొండ వద్ద సమీకృత కలెక్టరేట్ ప్రారంభం కావడంతో మహబూబ్‌నగర్-భూత్పూర్ రహదారి శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. ఇటీవలే ఆటోనగర్‌ను కూడా ఏర్పాటు చేయడంతో భారీ వాహనాలకు అడ్డాగా మారింది. మెట్టుగడ్డ నుంచి ఎంవీఎస్ కళాశాల వరకు రహదారి విస్తరణను కూడా చేపట్టడంతో పట్టణానికి కనెక్టివిటీ పెరిగింది.
కొత్త కలెక్టరేట్, బైపాస్, నాలుగులైన్ల రహదారి ఉండడంతో భూములకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. చాలామంది రోడ్‌సైడ్ భూములను అడ్వాన్స్‌గా కొనుగోలు చేయడంతో కమర్షియల్ కాంప్లెక్స్‌లకు ప్లాన్ చేస్తున్నారు. కలెక్టరేట్ ఉండడంతో ఆరునెలల్లోనే మహబూబ్‌నగర్-భూత్పూర్ రహదారి రూపురేఖలు మారిపోతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. వెంచర్ల యజమానులు ఖాళీ ప్లాట్లు, కమర్షియల్ ప్లాట్లుగా విభజించి విక్రయాలు చేపడుతున్నారు.
మరోవైపు ప్లాట్లల్లో ఇండ్ల నిర్మాణాలు జోరందుకుంటున్నాయి. టీఎస్ బీపాస్ రావడంతో చాలా సులువుగా పర్మీషన్లు ఇస్తున్నారు. అంతా ఆన్లైన్ కావడంతో ఇండ్లు, ప్లాట్లు ఉన్న వినియోగదారులకు ప్రభుత్వం ఎంతో వెసలుబాటు కల్పించింది. వెంచర్లలో 30 ఫీట్ల అంతర్గత రోడ్లు, ప్రధాన రహదారి 40 ఫీట్లు ఉంటేనే పర్మీషన్లు ఇస్తున్నారు. కస్టమర్లను ఆకట్టుకునేందుకు వెంచర్లలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలు, విద్యుత్, తాగునీటి సౌకర్యం, సీసీ రోడ్లు వేస్తున్నారు.
2016లో జిల్లాల విభజన సమయంలో మహబూబ్‌నగర్ చి న్న జిల్లాగా మారింది. రహదారులు బోసిపోవడం ఖాయమని ఎగతాళి చేశారు. కానీ నేడు పరిస్థితి తారుమారైంది. పాలమూరు రూపురేఖలే మారిపోయాయి. పట్టణ శివారుల్లో విలాసవంతమై న ఇండ్లు కట్టకొని ఉంటున్నారు. జడ్చర్ల నుంచి మహబూబ్‌నగ ర్ వరకు నాలుగులైన్ల రహదారి పూర్తి కావడం, బైపాస్ అందుబాటులోకి రావడంతో పట్టణంలో అన్ని రకాల షాపింగ్‌మాళ్లు వెలిశాయి. పాత కలెక్టరేట్ ఎదుట భారీ మల్టీప్లెక్స్‌తో కూడిన షా పింగ్మాల్కు స్థలం కేటాయించారు. అనేక బ్యాంకులు తమ శా ఖలను పెంచుకుంటున్నాయి. హైదరాబాద్‌లో పేరెన్నికగన్న హోటళ్లు, గోల్డ్, వస్త్ర దుకాణాలు వచ్చేశాయి.
అన్ని రంగాల అభివృద్ధే లక్ష్యం..
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో పా లమూరు జిల్లా కేంద్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇంకో ఏడాదిలో పాలమూరు జిల్లా స్వరూపమే మారిపోతుంది. 2,087 ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద కేసీఆర్ ఎకో అర్బన్‌పార్కు ఏర్పాటు చేశాం. ఐటీ టవర్‌లో రూ.10వేల కోట్ల పెట్టుబడితో బ్యాటరీ కంపెనీ రాబోతున్నది. ట్యాంక్‌బండ్, శిల్పారామం, సస్పెన్షన్ బ్రిడ్జి, మరో బైపాస్, హన్వాడ మీదుగా మరో జాతీయ రహదారి ఏర్పాటు కానున్నది. బండమీదిపల్లిలో కోర్టు సముదాయం రానున్నది. పాత కలెక్టరేట్లో సూపర్‌స్పెషాలిటీ దవాఖాన నిర్మాణం చేపట్టనున్నాం.
– శ్రీనివాస్‌గౌడ్, ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి