Remand | మరికల్ సర్కిల్ నర్వ పోలీస్ స్టేషన్ పరిధిలోని లంకల గ్రామానికి చెందిన అంజన్న(41)ను అతని భార్య రంగమ్మ ఈ నెల 20న మెడకు తాడు చుట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్టు మరికల్ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపారు. ఇవాళ మరికల్ సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నారాయణపేట సూర్యలక్ష్మి డిగ్రీ కళాశాలలో అటెండర్‌గా పనిచేస్తున్నాడని.. అంజన్న, రంగమ్మ మధ్య తరచూ కుటుంబ ఘర్షణలు ఉన్నాయని అన్నారు.
వారం రోజుల క్రితం అంజన్న తనకు గల ఐదు ఎకరాల పొలాన్ని తన దాయాదులకు రిజిస్ట్రేషన్ చేసి రెండు లక్షల రూపాయలు తీసుకున్నట్లు భార్య రంగమ్మకు తెలిసింది. దీంతో ఎలాగైనా తన భర్తను హతమార్చాలని ఈ నెల 20న మద్యం మత్తులో ఉన్న అంజన్న గొంతుకు తాడు బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు సీఐ తెలిపారు.
మర్నాడు ఉదయం అంజన్ననే ఉరి వేసుకొని చనిపోయినట్లు రంగమ్మ పోలీసులకు తెలిపిందని, అయితే అనుమానం వచ్చిన మృతుని అక్క పద్మమ్మ రంగమ్మనే హత్య చేసినట్టు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు తనదైన శైలిలో విచారించగా అంజన్నను హత్య చేసినట్టు రంగమ్మ ఒప్పుకోవడం జరిగిందని సీఐ రాజేందర్ రెడ్డి తెలిపారు. రంగమ్మను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఈ సమావేశంలో నర్వ ఎస్సై కురుమయ్య పాల్గొన్నారు.
Hyderabad | ఎస్టీ హాస్టల్లో పురుగుల అన్నం.. రోడ్డెక్కిన విద్యార్థులు