గద్వాల, మే 15 : చేతికొచ్చిన ధాన్యం అమ్ముకునేందుకు రైతులు పడుతున్న బాధలు వర్ణణాతీతం. ప్రభుత్వం కేంద్రాలు ఏర్పాటు చేసినా కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. లక్ష్యం సుదూరం ఉంటే.. కొనుగోళ్లు మాత్రం నామమాత్రంగా జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలో సేకరణకు టార్గెట్ 1.38 లక్షల మెట్రిక్ టన్నులు నిర్ధేశించగా.. ఇప్పటి వరకు కొనుగోలు చేసింది కేవలం 47 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే.. దీంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు సెంటర్ల వద్ద రైతులకు పడిగాపులు తప్పడం లేదు. పలు చోట్ల గన్నీ బ్యాగులు, హమాలీల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. దీనికి తోడు వాతావరణం రైతులను బెంబేలెత్తిస్తున్నది. అకాల వర్షాలు అల‘జడి’ సృష్టిస్తున్నాయి.
ఆరుగాలం కష్టించి పండించిన పం టను అమ్ముకునేందుకు రైతులు అష్టకష్టాలు పడాల్సి వస్తు న్నది. అకాల వర్షాలు కంటి మీద కునుకులేకుండా చే స్తున్నాయి. ధాన్యాన్ని ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసు కొస్తే పది రోజు లైనా కొను గోలు చేయకపోవడంతో అకాల వర్షాలకు ఆందో ళన చెందుతున్నారు. వారం రోజులుగా రా త్రిపగలు తేడా లేకుండా అకాల వర్షాలు కురుస్తుండండతో అవస్థలు పడుతున్నారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని, అధికారులను వేడుకున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో రైతులు ఆందోళన చెందుతు న్నారు.
జిల్లాలో యాసంగిలో రైతులు 68,896 ఎకరాల్లో వరి పంట సాగు చేసినట్లు వ్యవ సాయ శాఖ అధికారులు గుర్తించారు. సుమారు 2.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అ వుతుందని అంచనా వేశారు. ఇందులో మొ దటగా ప్ర భుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు 1.75లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేశారు. అయితే అందులో కొంత మంది రైతులు దొడ్డు రకం వే యడం, ఇతర ప్రాంతాల్లో ధాన్యం అమ్ముకోవడం, కొ నుగోళ్ల లక్ష్యం 1.38లక్షల మెట్రిక్ టన్నులకు కుదించారు.
కొనుగోళ్ల లక్ష్యం కుదించినప్పటికీ వేగంగా కొనుగోళ్లు జరగడం లేదు. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. కొనుగోలు సెంటర్ల ద్వారా రైతుల నుంచి 1.38లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉండగా, కేంద్రాలు ప్రారంభమై 45రోజులు అవుతున్నా ఇప్పటి వరకు జిల్లాలో 69 కొనుగోలు కేంద్రాల ద్వారా 6,900 మంది రైతుల నుంచి కేవలం 47వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు.
వానకాలం సమీ స్తున్నా ఇంకా రైతుల నుంచి సగభాగం ధాన్యం కూడా కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు వేగ వంతం చేయాలని రైతులు కోరుతున్నారు. కొనుగోళ్లకు సంబంధించి రైతులకు సుమారు రూ.55కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఇప్పటి వరకు రూ.24కోట్లు మాత్రమే సగభాగం మాత్రమే రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇంకా సగం మం ది రైతుల ఖాతాల్లో నగదు జమచేయాల్సి ఉన్నది. డబ్బుల జమ కోసం ధాన్యం అమ్మిన రైతులు ఎదురు చూస్తున్నారు.
ధాన్యం కొనుగోళ్లు నత్తనడక సాగడానికి ప్రధాన కారణం గన్నీబ్యాగులు, హమాలీల కొరత ఉన్నట్లు తెలుస్తున్నది. సరైన సమయంలో కేంద్రాలకు గన్నీబ్యాగులు రాకపో వడం, కూలీలు ధాన్యం తూకంపై ఆసక్తి చూపక పోవడంతో కొనుగోళ్లు ఆలస్య మవుతున్నట్లు తెలుస్తున్నది. దీనికి తోడు కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో ఆలస్యం అవుతుండడంతో కొనుగోళ్లు ఆలస్యం అవుతున్నాయని అ ధికారులు చెబుతున్నారు. రైతులకు అవసరమైన గన్నీ బ్యా గులు అందుబాటులో ఉంచితే కొనుగోళ్లు వేగవంతంగా జరిగే అవకాశం ఉందని రైతులు అంటున్నారు.
వాస్తవంగా జిల్లాకు కొనుగోళ్ల సీజన్ ముగిసే వరకు 19లక్షల గన్నీ బ్యాగులు అవసరం కాగా, సరిపడా గన్నీ బ్యాగులు జిల్లాకు రావడం లేదని రైతులు అంటున్నారు. అధికారులు మాత్రం గన్నీ బ్యాగుల కొరత లేదని, కొను గోలు కేంద్రాల్లో అయిపోయిన వెంటనే తెప్పిస్తున్నామని చెబుతున్నారు. కొనుగోళ్లు వేగంగా జ రగపోవడానికి గన్నీ బ్యాగుల కొరత కూడా కారణమని రైతులు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాలను సందర్శించి వేగవంతం చేసేలా చూ డాలని రైతులు అధికారులను కోరు తున్నారు.