MLA Yennam Srinivas Reddy | మహబూబ్ నగర్ : ప్రతీ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని ధర్మాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముడా నిధులతో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పదవ తరగతి వార్షిక పరీక్షలకు సన్నద్ధమౌతున్న విద్యార్థులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
అందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ధర్మాపూర్ గ్రామంలో 40 లక్షల రూపాయలతో ఎస్సీ సబ్ ప్లాన్ కింద మంజూరైన సీసీ రోడ్లు , అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతీ గ్రామంలో అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తున్నామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, సుధాకర్ రెడ్డి, రామచంద్రయ్య, శ్రీనివాస్ యాదవ్, గోవింద్ యాదవ్, ధర్మాపూర్ నర్సింహారెడ్డి, మల్లు అనిల్ కుమార్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
Nagarkurnool | చేతకాకపోతే గద్దె దిగండి.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ పాడి రైతులు
Air India | అజర్బైజాన్ గగనతలంలో ప్రయాణిస్తున్న విమానానికి బెదిరింపులు.. ముంబైకి దారి మళ్లింపు
Donthi Madhav Reddy | అర్హులైన వారందరికి ఇందిరమ్మ ఇండ్లు : దొంతి మాధవరెడ్డి