కోస్గి, నవంబర్ 11 : కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యా ల మండలంలోని లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీకి భూము లు ఇవ్వలంటూ అభిప్రాయ సేకరణకు సోమవారం వికారాబాద్ కలెక్టర్ ప్రతిక్‌జైన్, కాడ ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, కొడంగ ల్, దుద్యాల తాసీల్దార్లు విజయ్‌కుమార్, కిశోర్‌తో కలిసి వచ్చా రు. ఈ సందర్భంగా గ్రామంలో సమావేశాన్ని ఏర్పాటు చేయగా గ్రామస్తులు, రైతులు మా భూములు ఇవ్వం.. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని నినాదాలు చేశారు. కానీ అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేసిన వారు వినిపించుకోకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తతగా మారింది. అయితే ఫార్మా కంపెనీ ఏర్పాటు చేస్తే ఊరు మొత్తం ఖాళీ చేయాల్సి వస్తుందని, వ్యవసాయం పూర్తిగా అం తం అవుతుందని రైతులు ముందునుంచే వ్యతిరేకిస్తున్నారు. ఇ దే విషయంలో గతంలో కాంగ్రెస్ నాయకుడిని గ్రామ పంచాయతీలో వేసి రైతులు బంధించారు. తాజాగా కలెక్టర్, కాడ అధికారితోపాటు పలువురు అధికారులను గ్రామం విడిచి వెళ్లిపోవాలని వెంబడించారు. వారి వాహనాలపై రాళ్లు, కర్రలు విసిరారు. మా ప్రాణాలు పోయినా మా ప్రాంతానికి ఫార్మాను రానివ్వమ ని రైతులు హెచ్చరిస్తున్నారు.
బీఆర్ఎస్ నాయకులు ముందస్తు ప్లాన్‌తో కలెక్టర్‌పై దాడి చేశారంటూ కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటు. లగచర్ల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడి భూమి ఫార్మా కంపెనీలో పోతుందని గ్రామ రైతులతో కలిసి ఫార్మాకు వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. గతంలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి సైతం ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా మద్దుతు ప్రకటించారు. ఫార్మా కంపెనీ ఏర్పడితే కోస్గి వరకు కాలుష్యం ఏర్పడుతుంది. అందుకే ఫార్మాను వద్దని కోరుతున్నాం. – శాసం రామకృష్ణ,
గ్రంథాలయ సంస్థ మాజీ జిల్లా చైర్మన్, నారాయణపేట