మానవపాడు: కాల్వలకు గండ్లు పెట్టి అక్రమంగా నీటి చౌర్యానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్డీయస్ డీఇ శ్రీనివాస్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని నారాయణపురం గ్రామ శివారులో ఉన్న ఆర్డియస్ కాలువ 112.80 దగ్గర కాలువకు ఉన్న ఎస్కేప్ దగ్గర గండి పెట్టి అక్రమంగా నీటిని వాడుకుంటున్నారనే సమాచారంతో అక్కడికి చేరుకున్న ఆర్డీయస్ సిబ్బంది గండిని పూడ్చి వేశారు.
అనంతరం కాల్వవకు గండి ఎవరు పెట్టారని విచారణ చేయగా గుర్తు తెలియని వ్యక్తులని తేలింది. దీనిపై కోదండాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని ఎఇ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కాలువల్లో నీరు పుష్కలంగా వస్తోందని ఆయకట్టు రైతులు అందరూ వాడుకోవచ్చని కాలువలకు గండ్లు పెట్టవద్దని ,కాలువకు గండ్లు పెట్టడం వల్ల కింది రైతులకు సాగు నీరు అందడం లేదని డీఇ శ్రీనివాస్ పేర్కొన్నారు.