అయిజ, నవంబర్ 22 : కర్ణాటకలోని తుంగభద్ర జలా శయం మరమ్మతు లకు టీబీ బోర్డు పచ్చ జెండా ఊపింది. శుక్ర వారం కర్ణాటకలోని హోస్పేట్ లోని తుంగ భద్ర మండలి కార్యాల యంలో చైర్మన్ ఎస్ఎన్ పాండే అధ్యక్షతన బోర్డు సమా వేశం జరిగి ంది. సమావేశంలో డ్యాంకు చేపట్టా ల్సిన మరమ్మతులపై ప్రధానంగా చర్చించారు. 73 ఏండ్లపాటు కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ర్టాలకు సేవల ందించి పాత బడిన క్రస్ట్‌గేట్లను మార్చి మరో 40 ఏండ్లు టీబీ డ్యాం భద్రంగా ఉండటానికి చర్యలపై కీలక నిర్ణయం తీసుకున్నారు.
కర్ణాటక, ఏపీ, తెలంగాణ జలమండలి అధికారులు ప్రత్యక్షంగా, పరో క్షంగా హాజరయ్యారు. టీబీ డ్యాం 19వ గేటు కొట్టుకు పోయిన తర్వాత విచారణకు వచ్చిన నిపుణులు గేట్లను మార్చాల్సిందేనని నివేదిక సమర్పించారని, జలాశయ నిపుణుడు కన్నయ్య నాయుడు గేట్లను మార్చాలని స్పష్టం చేశారని, అందుకనుగుణంగా వచ్చే నెలలో డ్యాం సెఫ్టీ బృందం పర్యటించి తుది నిర్ణయం తీసుకుంటుందని చైర్మన్ తెలిపారు.
నిపుణుల నివేదికను మూడు రాష్ర్టాల జల మండలి అధికారులు సూత్రాప్రాయంగా అంగీకారం తెలిపారని డ్యాం సెక్షన్ అధికారి రాఘవేంద్ర తెలిపారు. డ్యాం సేఫ్టీ బృందం సూచనల మేరకు జనవరి నాటికి మరమ్మతులు చేపట్టేందుకు టెండర్లను పూర్తి చేసి వేసవిలో మరమ్మతులు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించిందని పేర్కొన్నారు. సమావేశంలో బోర్డు కార్యదర్శి ఓఆర్కే రెడ్డి, కర్ణాటక ఈఎన్సీ కృష్ణమూర్తి కులకర్ణి, వర్చ్‌వల్‌గా తెలంగాణ ఈఎన్సీ అనిల్‌కుమార్, ఇంటర్ స్టేట్ సీఈ మోహన్‌కుమార్, ఎస్ఈ విజయ్ కుమార్, గద్వాల ఎస్ఈ రహీముద్దీన్ పాల్గొన్నారు.