అమరచింత, మార్చి 30 : విశ్వావాసు నామ ఉగాది పర్వదినం పండగ సందర్భంగా పట్టణంలోని దశమి కట్ట సమీపంలో వాల్మీకి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఎద్దుల బండ్ల గిరకలాగుడు పోటీల్లో గెలుపొందిన విజేతలకు బిజెపి నాయకులు మేరువరాజు, పట్టణ అధ్యక్షుడు క్యామ భాస్కర్ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు వెంకటేష్ రాజశేఖర్ మాట్లాడుతూ రైతులను ఉత్సాహపరిచేందుకు ఉగాది పండుగ సందర్భంగా ఎద్దుల బండ్ల గిరకలాగుడు పోటీలు నిర్వహించామన్నారు. ఈ పోటీలకు పట్టణ రైతుల నుంచి విశేష స్పందన వచ్చిందన్నారు.
ఇవి కూడా చదవండి..
Tollywood Movies | ఉగాది స్పెషల్.. టాలీవుడ్ నుంచి కొత్త సినిమా పోస్టర్లు
Sam Altman | దయచేసి జీబ్లీ వాడకం తగ్గించండి.. ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్మన్
Swati Sachdeva | మరో స్టాండప్ కమెడియన్ అసభ్య వ్యాఖ్యలు.. మండిపడుతున్న నెటిజన్లు