Sam Altman | దయచేసి జీబ్లీ వాడకం తగ్గించండి.. ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్
Sam Altman | ఇన్‌స్టా, ఫేస్బుక్, ఎక్స్.. ఇలా ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను ఓపెన్ చేసినా ఫీడ్ మొత్తం జీబ్లీ (Ghibli) ఫొటోలతో నిండిపోతోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ‘జీబ్లీ స్టైల్ (Ghibli style)’ ఇమేజ్ జనరేటర్ ట్రెండ్ అవుతోంది.
Sam Altman : ఇన్‌స్టా, ఫేస్బుక్, ఎక్స్.. ఇలా ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను ఓపెన్ చేసినా ఫీడ్ మొత్తం జీబ్లీ (Ghibli) ఫొటోలతో నిండిపోతోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ‘జీబ్లీ స్టైల్ (Ghibli style)’ ఇమేజ్ జనరేటర్ ట్రెండ్ అవుతోంది. యూజర్లను ఆకట్టుకునేందుకు ఓపెన్ ఏఐ సంస్థ ఇటీవల చాట్‌జీపీటీలో (ChatGPT) జీబ్లీ స్టూడియోను ప్రవేశపెట్టింది. దాంతో యూజర్లు తమ ఫొటోలను యానిమేషన్ తరహా చిత్రాలుగా మార్చుకుంటున్నారు.
అయితే కొత్తొక వింత పాతొక రోత అన్నట్లుగా ఈ కొత్త సదుపాయాన్ని యూజర్లు విపరీతంగా వినియోగిస్తున్నారు. దీనిపై ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్ (Sam Altman) స్పందించారు. జీబ్లీ వినియోగం ఎక్కువగా ఉందని, ఈ విషయంలో యూజర్లు కాస్త కూల్‌గా ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ‘మా సిబ్బందికి నిద్ర కూడా అవసరం కదా..! దయచేసి జీబ్లీ వినియోగం కాస్త తగ్గించండి.’ అని కోరారు.
ఓపెన్ ఏఐ సంస్థ ఇటీవల చాట్‌జీపీటీలో జీబ్లీ స్టైల్ ఇమేజ్ జనరేటర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఆప్షన్‌ను విపరీతంగా వినియోగిస్తుండడం వల్ల తమ జీపీయూ (GPU) వ్యవస్థపై అధిక భారం పడుతోందని, అందుకే దీనికి లిమిట్ పెడుతున్నామని ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్ ఇటీవల పేర్కొన్నారు. ఇప్పటికే ఉచిత యూజర్లకు ఫొటోల జనరేషన్లో రోజుకు మూడు అనే పరిమితి విధించారు. మరోవైపు గ్రోక్లో కూడా ఈ ఫొటో జనరేషన్ ఆప్షన్‌ను యూజర్లు విరివిగా ఉపయోగిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Arnab | అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. పాపికొండలు విహారయాత్రకు బ్రేక్..!
MLA Anirudh Reddy | నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Modi Ka Baap Bhi Jayega: ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందే.. దేశవ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం
Invited for Bihu, then attacked | పూజా కార్యక్రమానికి ఆహ్వానించి.. బిహు కళాకారులపై దాడి
Womens Health | వయస్సు మళ్లుతున్న మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తుంటే.. జాగ్రత్త పడాల్సిందే..
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

