Swati Sachdeva | మరో స్టాండప్ కమెడియన్ అసభ్య వ్యాఖ్యలు.. మండిపడుతున్న నెటిజన్లు
Swati Sachdeva | ఇటీవల యూట్యూబర్ రణ్వీర్ అల్లహాబాదియా (Ranveer Allahbadia), స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో స్టాండప్ కమెడియన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.
Swati Sachdeva : ఇటీవల యూట్యూబర్ రణ్వీర్ అల్లహాబాదియా (Ranveer Allahbadia), స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో స్టాండప్ కమెడియన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. స్టాండప్ కమెడియన్ స్వాతి సచ్‌దేవా (Swati Sachdeva).. తాను ఊహించని విధంగా ఒక విషయంలో తన తల్లికి దొరికిపోయానని, ఆ సమయంలో ఆమెతో మాట్లాడటానికి ఎంతో ఇబ్బంది పడ్డానని చెప్పింది. ఆమె ఏ విషయంలో దొరికిందో కూడా తెలిపింది. ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దీంతో నెటిజన్లు ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మనం ఎప్పుడూ చూడని అత్యంత భయంకరమైన కామెడీలలో ఇదీ ఒకటని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ప్రేక్షకులను నవ్వించడానికి అసభ్యకర అంశాలను ఎంచుకోవడం సిగ్గుచేటని మరో నెటిజన్ రాసుకొచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో స్టాండప్ కామెడీ హద్దులు దాటుతోందని, షోలలో ఇలాంటి కంటెంట్‌ను ప్రోత్సహించకూడదని అన్నారు.
కాగా ఇటీవల ‘ఇండియాస్ గాట్ లేటెంట్’ షో వేదికగా యూట్యూబర్ రణ్వీర్ అలహబాదియా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. పలువురు ప్రముఖులు ఈ వ్యాఖ్యలను ఖండించారు. అతడిపై పలు కేసులు నమోదయ్యాయి. స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై అక్కడి నేతలు కేసులు పెట్టారు. తాజాగా స్వాతి సచ్‌దేవా అసభ్య వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో ఇలాంటి కంటెంట్ నియంత్రణపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Arnab | అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. పాపికొండలు విహారయాత్రకు బ్రేక్..!
MLA Anirudh Reddy | నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Modi Ka Baap Bhi Jayega: ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందే.. దేశవ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం
Invited for Bihu, then attacked | పూజా కార్యక్రమానికి ఆహ్వానించి.. బిహు కళాకారులపై దాడి
Womens Health | వయస్సు మళ్లుతున్న మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తుంటే.. జాగ్రత్త పడాల్సిందే..
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

