Wanaparthi | మరో 5 రోజుల్లో కొడుకు పెళ్లి..ఇంతలోనే తండ్రి మృతి
మరో ఐదు రోజుల్లో కుమారిడి పెళ్లి. వివాహ ఏర్పాట్లు పూర్తి చేసుకొని బంధువులను ఆహ్వానించేందుకు సిద్ధమయ్యారు. ఇంతలోనే ఆ ఇంట్లో విషాదం నెలకొంది.
హైదరాబాద్ : మరో ఐదు రోజుల్లో కుమారిడి పెళ్లి. వివాహ ఏర్పాట్లు పూర్తి చేసుకొని బంధువులను ఆహ్వానించేందుకు సిద్ధమయ్యారు. ఇంతలోనే ఆ ఇంట్లో విషాదం నెలకొంది. చుట్టాలకు పెండ్లి పత్రికలు ఇచ్చేందుకు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంటి పెద్ద ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర సంఘన వనపర్తి జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి మండలం మెంటేపల్లికి చెందిన వెంకటయ్య(48) కొడుకు ఉదయ్ కుమార్ వివాహం ఈ నెల 25 న ఖాయం చేసుకున్నారు.
ఈ క్రమంలో బంధువులకు పెండ్లి పత్రికలు ఇచ్చేందుకు బైక్‌పై వెంకటయ్య వెళ్తుండగా పెబ్బేరు వద్ద జాతీయ రహదారిపై బొలేరో వాహనం ఢీకొనడతో వెంకటయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య శృతి, ముగ్గురు కుమారులు ఉన్నారు. వెంకటయ్య మృతితో బంధువుల రోదనలు మిన్నంటాయి.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonam Wangchuk | నాయకులను రేపటిలోగా విడుదల చేయకపోతే.. నిరాహార దీక్ష చేస్తా: సోనమ్ వాంగ్‌చుక్
SA vs AUS | రెన్షా ‘తొలి డబుల్’ చేజారే.. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆలౌట్..!
Oppo F35 | ఒప్పో నుంచి ఎఫ్35, ఎఫ్35 ప్రో ఫోన్లు విడుదల.. అక్టోబర్ 11 నుంచి సేల్
Electrocution | విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతి
KTR | రైతుల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది.. గజ్వేల్ ఎమ్మార్వోపై కేటీఆర్ ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

