Kothakota | తెలంగాణ ప్రభుత్వం సోమవారం ప్రకటించిన గ్రూప్ వన్ ఫలితాలలో కొత్తకోట యువకుడు సత్తా చాటాడు. కొత్తకోట పట్టణానికి చెందిన మండ్ల పుష్పలత-మండ్ల వెంకటస్వామి కుమారుడు మండ్ల పవన్ కుమార్ 510 మార్కులు సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి గ్రూప్ 1 ఉద్యోగం సాధించనున్నాడు.
మండ్ల వెంకట స్వామి స్వస్థలం కొత్తకోట మండలం వడ్డేవాట గ్రామం. వెంకటస్వామి కొత్తకోట పట్టణంలోనే హెడ్ కానిస్టేబుల్‌గా, రైటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. నిపుణుల అంచనా ప్రకారం పవన్ కుమార్ సాధించిన మార్కులకు అడిషనల్ కలెక్టర్‌గా కానీ.. డీఎస్పీగా కానీ ఉద్యోగంలో చేరవచ్చునని అంచనా వేస్తున్నారు. వెంకటస్వామికి పలువురు మిత్రులు అభినందనలు తెలిపి త్వరలోనే నీ కుమారుడికి సెల్యూట్ కొట్టే సమయం ఆసన్నమైనదని సరదాగా ఆటపట్టిస్తున్నారు.
Read Also :
KTR | ఎట్లుండె తెలంగాణ.. ఎట్లాయె తెలంగాణ..! కేటీఆర్ ఆవేదన
Bomb Attack | పాఠశాలపై బాంబులతో దాడి.. షాకింగ్ వీడియో
Chhaava Movie | నాలుగు రోజుల్లో రూ.10 కోట్లు.. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ‘ఛావా’ విధ్వంసం