కొల్లాపూర్ రూరల్, అక్టోబర్ 8 : బీఆర్ఎస్ గూటికి వలసల పరంపర మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలతో అధికార పార్టీకి చెందిన పలువురు కారెక్కుతున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండలం నర్సాయిపల్లికి చెందిన 20 మంది కాంగ్రెస్ నాయకులు బుధవారం కొల్లాపూర్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి సమక్షంలో కారెక్కారు.
వీరికి బీరం గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్యారెంటీలపై కాంగ్రెస్ నాయకులను నిలదీయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు సమిష్టిగా పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు.