కొత్తకోట : భీమా కాల్వలో పడి ఓ విద్యార్థి మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే..వనపర్తి జిల్లా కొత్తకోట సమీపంలో భీమా కాలువలో మైనార్టీ కళాశాలకు చెందిన నవీన్ (సీఈసీ ఫస్టియర్) విద్యార్థి మృతి చెందాడు. ఆదివారం సాయంత్రం ఏడు గంటలకు జామకాయలు తెంపేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు భీమా కాల్వలో జారిపడినట్లు సమాచారం.
విషయం తెలుసుకున్న పోలీసులు మహబూబ్‌నగర్‌కు చెందిన విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా, నిన్న సాయంత్రమే ఈ సమాచారం బయటకు వచ్చినప్పటికి అత్యంత గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిస్తున్నది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.