పెద్దమందడి, మే 28: మండలంలోని మణిగిల్ల గ్రామానికి చెందిన యువకుడు వడ్డెర కొమిరె ఆంజనేయులు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా బీఆర్ఎస్ నేతలు ఆర్థిక సాయం అందించారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ జిల్లా యువజన నాయకులు పలుస శ్రీనివాస్ గౌడ్ రూ.4వేలు గ్రామస్తులకు ఇవ్వడంతో గ్రామ బీఆర్ఎస్ నాయకులు బుధవారం బాధిత కుటుంబం ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో వడ్డే చంద్రయ్య ,పెద్ద ఎల్లయ్య, మందడి శ్రీను, వేణు గోపాల్ రెడ్డి, గుంటి శివసాగర్, వడ్డెర శీను, మహేష్ కుమార్ యాదవ్, సాయికుమార్, చిన్న ఎల్లయ్య, కుమ్మరి బుచ్చయ్య, వడ్డే తిరుపతయ్య, సురేష్ పాల్గొన్నారు.