కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతుల సంక్షేమా న్ని దృష్టిలో ఉంచుకొని వానకాలం సీజన్ ప్రారంభమయ్యాక రైతుబంధు పంపిణీకి శ్రీకారం చుట్టే ది. నాటి ప్రభుత్వం రైతుబంధు పంపిణీ చేసిన వి వరాలను పరిశీలిస్తే.. 2021లో జూన్ 21న, 2022లో జూన్ 29న, 2023లో జూన్ 27 పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమచేసింది. 2023లో ఎన్నికల కోడ్ సందర్భంగా పూర్తి స్థాయి లో పంపిణీ చేయలేదు. మిగిలిపోయిన రైతులకు కాంగ్రెస్ సర్కారు విడుదల చేసింది. ప్రస్తుతం వానకాలం సీజన్ ప్రారంభమైనా రేవంత్ సర్కారు సాయం ఊసెత్తడం లేదు. ఎంతమందికి రైతుభరోసా ఇస్తారనేది ఇప్పటి వరకు అధికారికంగా రైతుల వివరాలను ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ నివేదించలేదన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికైనా రైతుల కష్టాలను దృష్టిలో ఉంచుకొని త్వరగా
గద్వాల, జూలై 8 : వానకాలం సాగు జోరందుకున్నది. సీజన్ ప్రారంభమయ్యే జూన్, జూలై మాసాలు రైతులను కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఓ వైపు పాఠశాలలు ప్రారంభం కావడం, మరో వైపు వ్యసాయ పనులు కూడా అప్పుడే షురూ కావడంతో రైతులపై ఈ రెండు నెలలు ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి. తమ పిల్లలకు పాఠశాల పుస్తకాలు, డ్రెస్లతోపాటు ఫీజులు చెల్లించాల్సి రావడం.. దీంతోపాటు పంటలు సాగులో భాగంగా విత్తనాలు, ఎరువుల కొనుగోలు కు డబ్బు అవసరం. ఈ తరుణంలో రైతులకు ఏమి చేయాలో పాలుపోవడం లేదు. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతుల్లో నెలకొన్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం వానకాలం సీజన్ ప్రారంభమైందే మొదలు రైతుబంధు సాయం అందించేది. దీంతో పెట్టుబడితోపాటు పిల్లలకు బడుల ఫీజు చెల్లించేందుకు అనుకూలంగా ఉండేది. అయితే కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి రావడంతో రైతులకు కష్టాలు మొదలయ్యాయి. రెండు సీజన్లకుగానూ సకాలంలో ఇవ్వాల్సిన రైతుభరోసా సమయానికి ఇవ్వకపోవడంతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. వానకా లం వచ్చిందటే పంటలకు పెట్టుబడి కాలంగా చెప్పాలి.
రైతులు వ్యవసాయ భూములు చదునుచేసి దుక్కిదున్ని విత్తనాలు, ఎరువుల కోసం పెద్ద మొ త్తంలో ఖర్చుచేయాల్సి ఉంటుంది. ఇప్పటికే దుక్కు లు దున్ని విత్తులు విత్తారు. ప్రస్తుతం కలుపుతీసే పనిలో నిమగ్నమయ్యారు. అయితే సీజన్ ప్రారంభమైనా ప్రభుత్వం రైతు భరోసా కింద అందించాల్సిన సాయం ఇంకా రైతుల ఖాతాల్లో జమ చేయలేదు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్ర జాభిప్రాయ సేకరణ పేరుతో కాలయాపన చేస్తుండండతో అన్నదాతలు రేవంత్ ప్రభుత్వంపై తీవ్రఆగ్రహంతో ఉన్నారు. ఎన్నికల సమయంలో రైతులందరికీ ఎటువంటి షరతులు లేకుండా రైతు భరోసా ఇవ్వడంతోపాటు కౌలు రైతులకు సైతం అందిస్తామని హామీ ఇచ్చిన విషయం విదితమే. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఎకరాల వరకు రైతుభరోసా అందించాలనే అంశంపై రైతులు, రైతు సంఘాలతో ప్రజాభిప్రాయ సేకరణ చేస్తుండడంపై సర్వత్రా విమర్శలు తలెత్తుతున్నాయి. యాసంగి సీజన్లో సైతం పెంచి ఇవ్వకుండా రైతుబంధు సాయం అందించిందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడేమో అభిప్రాయ సేకరణ అంటూ కాలయాపన చేస్తుండడంపై రైతులు అసంతృప్తితో ఉన్నారు. దీనికి తోడు కౌలు రైతులకు రైతు భరోసాపై ఇప్పటి వరకు ప్రభు త్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
కాంగ్రెస్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా రైతులకు ఎటువంటి షరతులు లేకుండా ప్ర భుత్వం రైతుభరోసా ఇవ్వాలి. కేసీఆర్ ప్ర భుత్వం వానకాలం సీజన్ ప్రారంభంకాగానే రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేసేది. దీంతో మొదటి విడుత పెట్టుబడి సాయానికి ఎంతగానో ఉపయోగపడేవి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సీజన్ ప్రారంభమైనా రైతుభరోసా ఇవ్వకుండా ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో ఆలస్యం చేస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ వెంటనే అమలు చేసి రైతులందరికీ త్వరగా పంట పెట్టుబడి సాయం అందించాలి.