కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన బాధితులు
ఓ పెళ్లి వేడుకలో మిగిలిన స్వీట్లను తినడంతో శుక్రవారం రాత్రి 60 మందికి వాంతులు, విరేచనాలతోపాటు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని వెంటనే ప్రభుత్వ జనరల్ దవాఖానకు బీఆర్ఎస్ కార్పొరేటర్లు నరేశ్, మధుమోహన్ తరలించా రు.
- పరామర్శించిన మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్, జూన్ 27 : ఓ పెళ్లి వేడుకలో మిగిలిన స్వీట్లను తినడంతో శుక్రవారం రాత్రి 60 మందికి వాంతులు, విరేచనాలతోపాటు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని వెంటనే ప్రభుత్వ జనరల్ దవాఖానకు బీఆర్ఎస్ కార్పొరేటర్లు నరేశ్, మధుమోహన్ తరలించా రు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అర్ధరాత్రి దవాఖానకు చేరుకొని చికిత్స పొందుతు న్న బాధితులను, చిన్నారులను పరామర్శించారు. అనంతరం మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో ఉమ్మడి జిల్లాలోనే పెద్ద దవాఖాన అయిన అత్యవసర వైద్యసేవల కోసం పేదలు ఈ దవాఖానకు వస్తే ఇక్కడ నిరంతరం డాక్టర్లు ఉండాల్సి ఉండగా ఇక్కడ 50 మంది డాక్టర్లను ఎలా రిలీవ్ చేస్తారని ప్రశ్నించారు. ఇంత పెద్ద ఆపద వస్తే డాక్టర్లు, నర్సులను ఎలా బదిలీ చేస్తారని అడ్డగోలుగా బదిలీలు చేస్తే మేము ఊరుకోమన్నారు. మొట్టమొదటి మెడికల్ కళాశాల తీసుకువచ్చి వైద్యులను తీసుకురావడంతోపాటు వసతులు కల్పించామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలోని దవాఖానలో వైద్యుల కొరత ఉంది. ఒకరి ని కూడా రిలీవ్ చేయకుండా పేదలకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఇంత పెద్ద ఘ టన జరిగి 60మంది దవాఖాన పాలైతే కలెక్టర్, వైద్యాధికారులు కూడా ఇంత వరకు పరిశీలన చేయలేదని ఆయన ఆవేదన వ్యక్తం చే శారు. వెంటనే రోగులకు వైద్యసేవలు అదేవిధంగా చూడాలని కోరారు.
చికిత్స పొందుతున్న బాధితులు
స్వీట్ తిన తర్వాత కడుపు నొప్పితో కూడిన వాంతులు కావడంతో రాత్రి 11 గంటలకు ప్రభుత్వ జనరల్ దవాఖానలో చేరారు. ఇందులో శనివారం 26మంది చిన్నపిల్లలు, గర్భిణి కూ డా ఉన్నారు. వారికి దవాఖానలో మెరుగైన వైద్యం అందిస్తున్నామని డీఎంహెచ్‌వో శ్రీనివాస్ తెలిపా రు. వారి ఆరోగ్య పరిస్థితిని పరీక్షించామని, అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన తెలిపారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

