పాలమూరు, మార్చి 1 : తెలంగాణ ఏర్పడిన తర్వాత బోనాల పండుగకు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చి సీఎం కేసీఆర్ ఆత్మగౌరవాన్ని చాటి చెప్పారని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బుధవారం మ హబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని న్యూప్రేమ్ నగర్‌లోని పోచమ్మ, మైస మ్మ, బొడ్రాయి, విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాల్లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సతీసమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ రా ష్ర్టానికి ప్రతీకగా బోనాల పండుగ నిలుస్తున్నదన్నారు. బోనాల పండుగ అంటే నేడు ఊర్లన్నీ ఆనందంగా జరుపుకొనే పండుగ అన్నారు.
పోతరాజుల వేషధారణలు, బొడ్డెమ్మల కోలాహలం, బోనా ల ఊరేగింపులు, బతుకమ్మ మన సంస్కృతికి అద్దంపట్టే పండుగ అ న్నారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమానికి సర్కార్ కృషి చేస్తున్నదన్నారు. ఒకప్పుడు ఇరుకైన రోడ్లు, సరైన మౌలిక వ సతులు లేక ప్రేమ్‌నగర్.. ఇప్పుడు సువిశాలమైన రోడ్లతో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్నదన్నారు. మహిళలు బోనాలతో ఊరేగింపుగా వెళ్లి పోచమ్మ కు సమర్పించి పూజలు చేశారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ గంజివెంకన్న, కౌన్సిలర్లు కిశోర్, బాలీశ్వరి, బీఆర్ఎస్ నాయకుడు వెంకట్రాములు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.