మహబూబ్‌నగర్, ఆగస్టు 21 (నమ స్తే తెలంగా ణ ప్రతినిధి) : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో బస్తా యురియా కోసం రైతన్నలు ఆందోళనకు దిగా రు.. రాష్ట్ర ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా యూరియాను పీఏసీసీఎస్‌ల ద్వారా సరఫరా చేస్తుంది. గురువారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యూరియా కోసం అనేక చోట్ల వందలాది మంది రైతులు క్యూలో నిలబడ్డారు. సాక్షాత్తు సీఎం జిల్లాలో రైతులకు యూరియా దొరకని పరిస్థితి తలెత్తింది. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా సహకార సంస్థ ముందు తెల్లవారుజాము నుంచి రైతులు క్యూ లైన్ లో నిలుచున్నారు. మరోవైపు చెప్పులు, పాస్ పుస్తకాలు లైన్లో పెట్టి యూరియా కోసం ఎదురు చూసి ఆందోళనకు దిగారు.
జిల్లా కేంద్రంలోని ఈ పరిస్థితి ఉంటే ఇక మారుమూల మండలాల్లో పరిస్థితి ఏ విధంగా ఉందో ఊహించుకోవచ్చు. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాలో కూడా యూ రియా కోసం రైతులు ఇబ్బ ందులు పడ్డారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడం.. కొంత యూరియాను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంతో ఈ పరిస్థితి తలెత్తిందని రైతులు ఆరోపిస్తున్నారు. కొన్నిచోట్ల కొంతమందికి టోకెన్లు ఇచ్చి మిగతా వారికి రేపు రమ్మని పంపించారు. యూరియా కోసం రైతులు అగచాట్లు పడుతుంటే ఇటు వ్యవసాయ శాఖ కాని అటు జిల్లా యంత్రాంగం కానీ పట్టించుకోవడం లేదు. బ్లాక్‌లో యూరియా విచ్చలవిడిగా దొరుకుతున్న అధికారులు పట్టించుకోవడంలేదని విమర్శలు వస్తున్నాయి.
రైతుల కన్నెర్ర మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో బస్తా యూ రియా కోసం రైతులు తెల్లవారుజాము నుంచి పాత బస్టాండ సమీపంలోని డీసీఎంఎస్ కార్యాలయం ఎదుట వందలాది మంది బారులు తీరారు. అయితే తీరిగ్గా 10 గంటలకు వచ్చిన అధికారులు స్టాక్ ఉన్నంతవరకే యూరియా ఇస్తామని చెప్పడంతో రైతులు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు కక్కారు. కేసీఆర్ పాలనే బాగుందని కాంగ్రెస్‌కు ఓటు వేసి తప్పు చేశామ ని శాపనార్థాలు పె ట్టారు. ఈ పరిస్థితి వస్తుందని ఊహించలేదని ఇదెక్కడి ప్రజాపాలన అంటూ నిలదీశారు. జిల్లా కేంద్రం మొత్తం రణరంగంగా మారింది. పోలీసులు, రైతులకు నచ్చచెప్పి ఉన్న కాడికి యూరియాను అందించే పరిస్థితి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాపురించింది.
అమరచింత, ఆగస్టు 21 : ఆత్మకూరులోని పీఏసీసీఎస్ వద్దకు గురువారం ఉదయం రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. యూరియా కోసం వరుసగా చెప్పులు, ఇటుకలు పెట్టి యూరియా కోసం పడిగాపులు కాశారు. క్యూలో నిలిచి అలసిపోయిన తర్వాత చెప్పులను వరుస క్రమంలో ఉంచారు. గంటల తరబడి వేచి ఉండడంతో నీరసించి పక్కనే ఉన్న చెట్ల కింద కొద్దిసేపు సేదతీరారు. ఈ క్రమ ంలో జైకిసాన్ జంక్షన్‌కు యూరియా వచ్చిందన్న సమాచారం అందుకున్న కర్షకులు అక్కడికి చేరుకున్నారు.
అయితే యూరియా కావాలంటే గుళికలు లేదా అడుగుపిండి, క్రిమిసంహారక మం దులు తీసుకోవాలన్న నిబంధనను నిర్వాహకులు పెట్టారు. దీంతో కొందరు తీసుకోగా.. మరికొందరు నిరాశతో వెనుదిరిగారు. నాగల్కడ్మూర్లోని రైతు ఆగ్రో సేవా కేంద్రంలోనూ డీలర్ ఇవే నిబంధనలు విధించి యూరియాను విక్రయించినట్లు రైతులు వాపోయారు. వారందరికీ నందీశ్వర ట్రేడర్స్‌పై రశీదులు ఇచ్చినట్లు తెలిసింది. దీనిపై ఏవో అరవింద్‌ను వివరణ కోరగా రైతు ఆగ్రో సేవా కేంద్రం మీదనే బిల్లులు ఇవ్వాలని, ప్రైవేట్ బిల్లులు ఇస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.