మహబూబ్నగర్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి పాలమూరు జిల్లాలో గురువారం ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. పిడుగుపాటుకు ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. అనేక చోట్ల తోటలు ధ్వంసమయ్యాయి. ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది. అకాల వర్షానికి అ న్నదాతలు కుదేలయ్యారు. నాగర్కర్నూల్, జో గుళాంబ గద్వాల జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షంతోపాటు వడగండ్ల వాన పడింది. మధ్యాహ్నం వరకు ఉక్కపోత భరించిన జనం సాయంత్రం కాగానే ఈదురుగాలితో కూడిన వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నాగర్కర్నూల్ జిల్లా పదర మండలంలో పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు మృతి చెందారు.
పొలాల్లో కూలి పనులకు వెళ్లిన సమయంలో భారీ వర్షంతోపాటు పిడుగు పడడంతో కండ్లకుంట గ్రామానికి చెందిన సుంకరి సైదమ్మ (35), ఈదమ్మ (55) అక్కడికక్కడే మృతి చెం దారు. మరో మహిళ సుంకరి లక్ష్మమ్మ గాయపడగా ఆమెను స్థానికులు అచ్చంపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో పశువుల కాపరి పశువులు మేపుతుండగా పిడుగుపాటు గురై మృతి చెందాడు.
మానవపాడు మండలం చంద్రశేఖర్నగర్ గ్రామంలో బోయ చిన్న వెంకటేశ్వర్లు (45) పిడుగుపాటుకు అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ఘటనలో గట్టు మండలం మాచర్ల గ్రామంలో పిడుగుపడి రెండు ఎద్దులు మృతి చెందాయి. వడగండ్ల వాన కురిసింది. ఇటిక్యాల మండలం రావులచెరువు గ్రామంలో ఈదురుగాలులకు 55 ఎకరాల్లో మా మిడి పంటకు తీవ్ర నష్టం వాటిళ్లడంతో రైతులు లబోదిబోమంటున్నారు. మానవపాడు మండలంలో మోస్తరు వర్షం కురువగా మిరప, పొగాకు పంటకు నష్టం కలిగింది. రాజోళి మండలంలో భారీ వర్షం కురువగా మొక్కజొన్న పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది.
అయిజ మండలం వెంకటాపురం, సిందనూరు, ధరూర్ మండలంలో ఈదురు గాలులతో జనం భయబ్రాంతులయ్యారు. ఎర్రవల్లి చౌరస్తా, అలంపూర్ చౌరస్తాలో వర్షం కురియగా విద్యుత్ అంతరాయం ఏర్పడింది. వర్షం కారణంగా ఎర్రవల్లి, అయిజ, వడ్డేపల్లి మండలాల్లో సుమారు మూడు గంటల పాటు విద్యు త్ సరఫరా నిలిచిపోయింది. ఉండవెల్లి మండలంలో వర్షానికి మిర్చి, పొగాకు తడిసి ముద్దయ్యింది. నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలంలోని నర్సాయపల్లిలో కుందేల తిరుపతయ్య ఇంటిపై పిడుగు పడటంతో తృటిలో ప్ర మాదం తప్పి ఇల్లు పాక్షికంగా దెబ్బతిన్నది. మహబూబ్నగర్ జిల్లాలో కూడా అక్కడక్కడ ఈదురు గా లులతో కూడిన వర్షం పడింది. నారాయణపేట జిల్లాలో అక్కడక్కడ చిరుజల్లు కురిశాయి.
మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాకు అకాల వర్షాలు వెంటాడుతున్నాయి. వడగండ్ల వానకు మహబూబ్నగర్ జిల్లాలో పంటలకు తీవ్ర నష్టం చేసింది. వందల ఎకరాల్లో వరి పంట, పండ్ల తోటలు, ఇతర పంటలకు నష్టం కాగా.. మామిడి తోటలో కాయలు రాలీ తీరని నష్టాన్ని మిగిల్చాయి. మళ్లీ వారం తిరక్క ముందే ఏకంగా ఈదురు గాలులు, వడగండ్లు, పిడుగుపాటుతో ఉమ్మడి జిల్లా అతలాకుతలమయిం ది. ఏకంగా ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఈసారి నష్టం అంచనాలకు మించి ఉన్నది.
ప్ర భుత్వం నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. వ్యవసాయశాఖ అధికారులు పంట నష్టంపై అంచనాలు వేసి ప్రభుత్వం నుంచి సహాయం అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కూలి పనులకు వెళ్లిన వారిపై పిడుగుపాటు పడి చనిపోవడంతో ఆయా కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఒక్కసారిగా వడగాల్పులతో తీవ్ర ఇ బ్బంది పడ్డ జనం.. ఉరుములు మెరుపులతో కూడి న వర్షానికి కుదేలవుతున్నారు. ఉమ్మడి జిల్లాకు వస్తే అతివృష్టి లేదంటే అనావృష్టిల పరిస్థితులు తయారయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.