మహబూబ్‌నగర్, జూన్ 16 : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు జాబ్‌క్యాలెండర్ పేరుతో ప్రతి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు వేస్తామని ప్రకటించి అధికారంలోకి వచ్చాక రెండేండ్లు కావస్తున్నా ఒక నోటిఫికేషన్ కూడా వేయకుండా మోసం చేశారని నిరుద్యోగులు నిరసన ర్యాలీని పెద్దఎత్తున చేపట్టారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రధాన గ్రంథాలయం నుంచి ఏనుగొండ ప్రధాన రహదారి వరకు పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుద్యోగుల ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని పాలమూరు నిరుద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత కేసీఆర్ ప్రభు త్వం వేసిన ఉద్యోగాలు తప్పా కొత్తగా ఒక నో టిఫికేషన్ కూడా వేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ గ్రంథాలయంలో రాత్రి పగలూ తేడా లేకుం డా 24గంటలు చదువుతున్నా ఉద్యోగ నోటిఫికేషన్ వేయకపోవడంతో తీవ్ర నిరాశ చెందుతున్నట్లు తెలిపారు.
ప్రభుత్వం విడుదుల చేసి న జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు వెంటనే విడుదుల చేయాలని డిమాండ్ చేశా రు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రారంభమైతే మళ్లీ ఏడాది పడుతుందని ముందుగా నిరుద్యోగుల హామీ మేరకు జాబ్ క్యాలెండర్ వేయాలని కోరారు. ఈనెల 20వ తేదీన హైదరాబాద్‌లోని ఇంది రా పార్కువద్ద నిరుద్యోగులు, విద్యార్థుల పిలుపు మేరకు మహాగర్జన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ర్యాలీలో నిరుద్యోగులు అశో క్, ప్రత్యూష, వెంకటేశ్, దామోదర్, హర్ష, బాలరాజు, నరేశ్, సాయికృష్ణ పాల్గొన్నారు.