అయిజ, అక్టోబర్ 28 : కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణా, తుంగభద్ర నదులకు వరద కొనసాగుతున్నది. సోమవారం ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి జూరాల ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 31,000 క్యూసెక్కులు ఉం డగా, అవుట్ ఫ్లో 33,100 క్యూసెక్కులు నమోదైంది. పూర్తిస్థా యి నీటినిల్వ 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 9.357టీఎంసీల నిల్వ ఉన్నది.
ఆల్మట్టి ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 21,378 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 21,378 క్యూసెక్కులు నమోదైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 129.72 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 128.19 టీఎంసీల నిల్వ ఉన్నది. నారాయణపూర్ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 19,945 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 18,158 క్యూసెక్కులు నమోదైంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 37. 40 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 37.56 టీఎంసీలు ఉన్నది.
కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతున్నది. ఇన్‌ఫ్లో 15,792 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 15,432 క్యూసెక్కులు నమోదైంది. 105.788 టీఎంసీల గరిష్ఠసామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్తుతం 101.773 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. ఆర్డీఎస్ ఆనకట్టకు ఇన్‌ఫ్లో 30,387 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 29,700 క్యూసెక్కులు సుంకేశుల ప్రాజెక్టులోకి చేరుతున్నది. ఆర్డీఎస్ ఆయకట్టుకు 687 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఆనకట్టలో 10.2 అడుగుల మేరకు నీటి మట్టం ఉన్నది.