బాలానగర్, మే 30 : గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తోందని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం మొదంపల్లిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అంతకుముందు మండలంలోని పెద్దాయపల్లి శివారులోని మార్కెట్ యార్డులో సీసీ ప్లాట్ ఫాం నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
అలాగే బాలానగర్, రాజాపూర్ మండలాల్లో ఇటీవల కాలంలో పలు విద్యుత్ ప్రమాద సంఘటనలో మృతి చెందిన 5 మందికి విద్యుత్ శాఖ నుంచి మంజూరైన ఎక్స్ గ్రేసియా రూ. 25 లక్షల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
కార్యక్రమంలో టీజీసీసీ చైర్మన్ వాల్యానాయక్, డీసీఎంఎస్ చైర్మన్ పట్ల ప్రభాకర్ రెడ్డి, గిరిజన రాష్ర్ట నాయకుడు లక్ష్మణ్ నాయక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాసరావు, వర్కింగ్ మండల అధ్యక్షుడు బాలునాయక్, సింగిల్ విండో డైరెక్టర్ మంజూనాయక్, రైతు సమితి మండల అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రఘువీరా రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.