రవాణా వాహనాలకు రిఫ్లెక్టివ్ టేపులు.. 80 నుంచి 2,900 దాకా వసూలు
రవాణా వాహనాలకు రిఫ్లెక్టివ్ టేపులు అమర్చాలనే ప్రభుత్వ నిర్ణయంతో వాహనదారులపై మళ్లీ ఆర్థికభారం పడనున్నది. రూ.80 నుంచి 2,900వరకూ ఒక్కో వాహ నం నుంచి రిఫ్లెక్టివ్ టేపులకు వసూలు చేయనున్నారు.
- ఐదు కంపెనీలకు అమర్చే బాధ్యత
- క్యూఆర్ ఆధారిత ధ్రువీకరణ అమలు
- ప్రమాదాల నివారణే లక్ష్యం : ఆర్టీఏ
హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): రవాణా వాహనాలకు రిఫ్లెక్టివ్ టేపులు అమర్చాలనే ప్రభుత్వ నిర్ణయంతో వాహనదారులపై మళ్లీ ఆర్థికభారం పడనున్నది. రూ.80 నుంచి 2,900వరకూ ఒక్కో వాహ నం నుంచి రిఫ్లెక్టివ్ టేపులకు వసూలు చేయనున్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించ డం, రాత్రిపూట రవాణా వాహనాలు స్పష్టం గా కనిపించేందుకు ఈ నిర్ణయం తీసుకున్న ట్టు రవాణాశాఖ అధికారులు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ‘కేంద్ర మోటర్ వాహనాల నియమాలు-1989’లోని రూల్ 104, 104(ఈ) ప్రకారం రిఫ్లెక్టివ్ టేపులు, రియర్ మారింగ్ ప్లేట్లు అమర్చడం తప్పనిసరి. ఈ విధానం ఈ నెల 20 నుంచి రాష్ట్రంలో అమల్లోకి రానున్నట్టు పేర్కొన్నారు.
రూ.80 నుంచి రూ.2,900 వరకు
రిఫ్లెక్టివ్ టేపులు అమర్చేందుకు అధీకృత డీలర్లు రూ.80 నుంచి గరిష్ఠంగా రూ.2,900 వరకు తీసుకోవచ్చని రవాణాశాఖ తెలిపింది. దరఖాస్తులు, సర్టిఫికేషన్ చార్జీలు కలిపి ప్రభుత్వం ఆమోదించిన ధరలను వెల్లడించింది. సీటీ 20ఎంఎం(మీటర్‌కు) రూ.79.80-రూ.85 వరకు, సీటీ 50ఎంఎం (మీటర్‌కు) రూ.145 నుంచి రూ.152 వర కు, సీ3(జతకు) రూ.2,500 నుంచి రూ.2,650 వరకు, సీ4(జతకు) రూ.2,800 నుంచి రూ.2,900 వరకు చెల్లించాలి. ఇక రిఫ్లెక్టర్లు 40ఎంఎం రూ.35, 80ఎంఎంకు రూ.60 చెల్లించాలి. ఈ ధరలకు మించి వసూలు చేస్తే ఎంపానెల్ రద్దు చేయడం, బ్యాంక్ గ్యారెంటీ స్వాధీనం చేయడం వంటి కఠిన చర్యలుంటాయని అధికారులు హెచ్చరించారు. ఇందుకోసం ఎంపానెల్ చేసిన ఐదు కంపెనీలను ఎంపిక చేశామని, వారి వద్ద మాత్రమే రిఫ్లెక్టర్లు కొనుగోలు చేసి, సర్టిఫికెట్ పొందాలని పేర్కొన్నారు.
అవి లేకపోతే ‘నో ఫిట్నెస్ సర్టిఫికెట్’..
ఎంపానెల్ చేసిన కంపెనీలు తమ అధీకృత డీలర్లు/అప్లికేటర్ల ద్వారా రవాణా వాహనాలకు టేపులు అమర్చాలని పేర్కొన్నారు. అమ ర్చే టేపులపై రవాణా శాఖ లోగోతో కూడిన హోలోగ్రామ్, సీరియల్ నంబర్ కలిగిన క్యూ ఆర్‌కోడ్ ఉంటుంది. టేపులు అమర్చిన తర్వా త ‘అఫిక్సేషన్ సర్టిఫికెట్’ జారీ చేయాలి. సర్టిఫికెట్లో వాహనం, ఓఈఎం వివరాలు, ఫొ టోలు, కనీసం రెండేండ్ల వారంటీ వివరాలు ఉండాలి. ఇక ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం టేపు లు వేసినట్టు ధ్రువీకరణ తప్పనిసరి చేశారు. సర్యులర్ జారీ అయిన తేదీ నుంచి 3 నెలల వరకు పరిమిత మినహాయింపు ఉంటుంది (కొత్తగా అమర్చినవైతే). ఆ తర్వాత క్యూఆర్ ధ్రువీకరణ తప్పనిసరి అని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

