అచ్చంపేట, నవంబర్ 3 : ‘మొంథా తుఫాన్ మమ్మల్ని నిండా ముంచింది.. వారం రోజులుగా అధికారులు, సర్కారో ళ్లు ఎవరైనా వొచ్చి మా బాధలు పట్టించుకుంటారని ఆశించి నా.. చివరికి నిరాశే మిగిలింది.. ఆఖరుకి సీఎం రేవంత్రెడ్డి సారే వొస్తున్నారని తెలిసి ఒకింత మాలో ధైర్యం కలిగింది.. కా నీ ప్రాజెక్టు కోసం వచ్చి కనీసం మా పరిస్థితి గురించి అడిగే అ వకాశం లేకుండా వెళ్లిపోయిండ్రు.. తండాలో 250కిపైగా ఇం డ్లు నీటిలో మునిగిపోయాయి.. సర్వం కోల్పోయి తాగడానికి నీళ్లు, వండుకొని తినేందుకు బియ్యం, పాత్రలు, సరుకులు కూడా లేని దుర్భర పరిస్థితి నెలకొన్నది.
తండా మొత్తం బురదలో నిండిపోయింది. నడవడానికి కూడా రావడం లేదు. ప క్క తండాకు వెళ్లి తలదాచుకుంటున్నాం.. సర్వం కోల్పోయి రోడ్డున పడిన మా బాధలు తెలుసుకునే వీలు కూడా సర్కారోళ్లకు లేకపాయే.. ఓట్ల కోసం ఇంటింటికీ తిరిగి అడుక్కునే నా యకులు.. మాకు కష్టాలు వచ్చినప్పుడు మాత్రం అడ్రస్ లే కుండా పోయారు.. నిరాశ్రయులమైన మాలో చిన్నపిల్లలు, ముసలోల్లు కూడా ఉన్నారు.. కనీసం తినడానికి తిండిలేక.. తాగేందుకు నీళ్లు కూడా లేక పస్తులుంటున్నాం.. మా బాధలు చెప్పుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు.. ఇలాంటి విపత్కర పరిస్థితులో ఆదుకోవాల్సిన సీఎం రేవంత్రెడ్డి కనీసం తండా వైపు కన్నెత్తి చూడలేదు.. మాతో మాట్లాడలేదు.. అస లు ఆయన ఎందుకు వచ్చి వెళ్లారో అర్థం కావడం లేదు’.. అని నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం మార్లపాడుతండా వాసులు వాపోయారు.
సీఎం రేవంత్రెడ్డి సోమవారం మన్నెవారిపల్లి సమీపంలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు చేరుకోగా, తమ బాధలు చెప్పుకునేందుకు తండావాసులు, పరిసరా గ్రా మాల వాసులు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. లోపలికి వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. చివరి వరకైనా సీ ఎంను కలవాలని వేచి చూసినా నిరాశే ఎదురైంది. సీఎం వచ్చి న ప్రాంతం నుంచి పూర్తిగా నీటిలో మునిగిపోయిన మార్లపాడుతండా కూతవేటు దూరంలో ఉంటుంది. స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ మార్లపాడుతండా విషయమై సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. కాగా, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం మార్లపాడుతండా గిరిజనుల కోసమే సీఎం వస్తున్నారని సోషల్ మీడియాలో హడావుడి చేశారు. కానీ సీఎం వచ్చింది గిరిజనుల కోసం కాదని తెలిసి తండావాసులు నిట్టూర్చారు.
అచ్చంపేట రూరల్, నవంబర్ 3 : సీఎంతో మా సమస్యలు చెప్పుకుందామంటే తమను పోలీసులు అడ్డుకున్నారని పలువురు కూలీలు వాపోయారు. సోమవారం నాగర్కర్నూల్ జిల్లాలోని మన్నెవారిపల్లి ఎస్ఎల్బీసీ సందర్శనకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వస్తున్నారని తెలుసుకొన్న దేవులతండా, మన్నెవారిపల్లి, జోగ్యతండా, మార్లపాడు గ్రామాలకు చెందిన పలువురు దినసరి కూలీలు ఆయన్ను కలిసేందుకు యత్నించారు. 20 ఏండ్లుగా ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో తాము పనిచేస్తున్నా తమకు నాలుగు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని విన్నవించాలంటే తమను నిర్బంధించారని ఆవేదన చెందారు.
గతంలో తమకు రూ.600 కూలి ఇచ్చేవారని, ఇప్పడు రూ.450 ఇస్తున్నా.. సక్రమంగా అందించడం లేదని ఆందోళన చెందారు. తమ ప్రాంతానికి వచ్చిన సీఎం దృష్టికి తీసుకెళ్దామంటే అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ నాగరాజు తమను బలవంతంగా ఓ షెడ్డులో వేసి బయటకు రాకుండా గేట్లకు తాళం వేసి నిలువరించారన్నారు. తుఫాన్ దాటికి కురిసిన వర్షంతో తమ ఇండ్లు, పొలాలు నిండా మునిగాయని, తమకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వర్తింపజేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తమపై పోలీసులు వ్యవహరించిన తీరుపై పలువురు మండిపడ్డారు.