కల్వకుర్తి, జూన్ 24 : కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామానికి చెందిన గోవర్ధన్‌రెడ్డి విజయ డెయిరీ ఆధ్వర్యంలో గ్రామంలో నిర్వహిస్తున్న పాల సేకరణ కేంద్రానికి పాలు పోస్తున్నాడు. వ్యవసాయంతోపాటు పాడి పరిశ్రమ నిర్వహిస్తూ వచ్చిన డబ్బులతో తన పిల్లలను చదివించుకుంటున్నాడు. పిల్లల చదువులు, నెలవారీ ఖ ర్చులకు ఆ కుటుంబానికి పాలబిల్లే ఆధారం. వారి పిల్ల లు హైదరాబాద్‌లోని ప్రైవేట్ హాస్టళ్లలో ఉంటూ ఇంజినీరింగ్ అభ్యసిస్తున్నారు. వారికి నెలనెలా ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. గోవర్ధన్‌రెడ్డికి 15రోజులకు దాదాపు రూ.20వేల వరకు పాలబిల్లు వస్తుంది. కాగా, మూడు విడుతలుగా (15రోజులకు ఒక విడుత) పాలబిల్లు రా వడం లేదు. పిల్లల చదువులకు కచ్చితంగా డబ్బులు పంపాల్సి ఉండగా, పాల బిల్లు రాకపోవడంతో చేసేది లేక చివరకు వడ్డీ వ్యాపారి వద్ద డబ్బులు తీసుకొని పిల్లలకు పంపించాడు. ఇది కేవలం గోవర్ధన్‌రెడ్డి ఒక్కడి పరిస్థితే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా విజయ డెయిరీకి పాలు పోస్తున్న పాడి రైతులందరిది. పాలబిల్లులు రాకపోవడంతో, డబ్బుల కోసం పడరాని పాట్లు పడుతున్నారు.
ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు నెల జీతం మాదిరిగానే పాడి రైతులకు కూడా ప్రతి 15 రోజులకోసారి ఇచ్చే పాల బిల్లే ఆధారం. వ్యవసాయంతోపాటు పాడిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. వ్యవసాయానికి పె ట్టుబడులు, విద్యార్థుల చదువులకు, ఇంటి సరుకులకు ఇలా పాల విక్రయం ద్వారా వచ్చిన డబ్బులే ఆధారం. 15 రోజులకు చెల్లించే పాల బిల్లు మూడు విడుతలు (45 రోజులుగా) పెండింగ్‌లో ఉండిపోయాయి. ఈనెల 30వ తేదీ దాటితే మరో విడుత పెండింగ్ అవుతుంది. ఇన్ని రోజులుగా డబ్బులు ఇవ్వకుండా ఉంటే తమ బ తుకులెట్లా సాగాలని ప్రశ్నిస్తున్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లాలో పాడి రైతులకు రాష్ట్ర ప్రభు త్వం ఆధ్వర్యంలోని విజయ డెయిరీ మూడు విడుతలకు రూ.5కోట్లకుపైగా బకాయిలు ఇవ్వాల్సి ఉన్నది. ఈనెల 30వ తేదీ వస్తే నాలుగవ విడుతకు మరో రూ.కోటిన్నరకు పైగా కొత్త బకాయి వచ్చి చేరుతుంది. ప్రతి 15రోజులకు ఒకసారి నేరుగా పాడిరైతుల ఖాతాల్లోకి వచ్చే పాల బిల్లులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గాడి తప్పింది. రైతు సంక్షేమ ప్రభుత్వమని ఊకదంపుడు ఉ పన్యాసాలు ఇవ్వడమే కానీ క్షేత్రస్థాయిలో సమస్యలను పెంచుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యేలు చుట్టపుచూపుగా నియోజకవర్గాలకు వచ్చిపోతున్నారే తప్పా తమ కష్టాలను ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకుపోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పాల బిల్లుల కోసం పాడి రైతులు రోడ్డెక్కాల్సిన దు స్థితి నెలకొన్నది. పాలబిల్లులు చెల్లించాలని రైతులు ధ ర్నా, రాస్తారోకోలు చేస్తున్నారు. పాలకు డబ్బులు ఇవ్వకుండా ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నదని రెండు రోజుల కిందట కల్వకుర్తి నియోజకవర్గం క డ్తాల మండల కేంద్రంలో పాలశీతలీకరణ కేంద్రం ఎదు ట రాస్తారోకో, ధర్నా చేపట్టారు. రోడ్డుపై పాలను పారబోసి నిరసన వ్యక్తం చేశారు. అలాగే సోమవారం కల్వకుర్తి మండలం తాండ్ర గేట్ వద్ద శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిపై పాడిరైతులు ధర్నా, రాస్తారోకో చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాడిని నమ్ముకొని మనుగడ సాగిస్తున్న తమకు పాల బిల్లులు సకాలంలో చెల్లించకుండా ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తున్నదని మండిపడ్డారు. పాల బిల్లుల పెండింగ్ విషయమై జిల్లా డిప్యూటీ డైరెక్టర్ సత్యనారాయణ యాదవ్‌ను వివరణ కోరగా, ప్రభుత్వానికి సమ స్యను వివరించామని, వారం రోజుల్లో మూడు పెండిం గ్ బిల్లులు వస్తాయని సమాధానమిచ్చారు.
ఉమ్మడి పాలమూ రు జిల్లాలో పాల ఉ త్పత్తిలో కల్వకుర్తి మొదటి స్థానంలో ఉన్నది. ఈ ప్రాంత రైతు బిడ్డలు ఎక్కువ గా పాడినే నమ్ముకుంటారు. ఎంత పెద్ద వ్య వసాయం ఉన్నా.. పాడి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి 15 రోజులకు వచ్చే పాల బిల్లు పాడి రైతులకు జీవనాధారం. పాల బిల్లు మూడు విడుతలు గా రాలేదు. ఈనెల 30వ తేదీ వస్తే నాలుగో వి డుత కూడా వస్తుంది. పాలబిల్లులు రాకపోవడంతో పాడి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రజా ప్రభుత్వమని చెప్పే కాంగ్రెస్ పెద్దలకు రైతుల సంక్షేమం పట్టదా?. రైతులను నిర్ల క్ష్యం చేస్తే ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మూడు విడుతల బకాయిలను చెల్లించడమే కాకుండా, పెండింగ్‌లో ఉన్న రూ.4 ప్రోత్సాహకాన్ని కూడా వెంటనే విడుదల చేయాలి.