పెద్దకొత్తపల్లి, మే 1 : ముక్కుపచ్చలారని ముగ్గురు చిన్నారులను చెరువు బలి తీసుకున్న ఘటన పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో గురువారం సాయంత్రం చోటు చేసుకున్న ది. వేసవి సెలవు లు ఇచ్చారనే ఆనందంలో పెద్దకొత్తపల్లి మండల కేం దానికి చెందిన ఏడుగురు చిన్నారులు గురువారం సాయంత్రం నాలుగు గంటలకు ఈతకు వెళ్లారు. అయితే చెరువు నిండుగా ఉండడంతోపాటు చెరువులో గుంతలు ఉండడం వల్ల ఏడుగురు విద్యార్థుల్లో సుధాకర్, రాధ దంపతుల కుమారుడు శ్రావణ్(7), ధర్మారెడ్డి కుమారుడు గణేశ్‌రెడ్డి (13), కుమార్తె రక్షిత(10) చెరువు లోకి దిగడంతో నీళ్లలో పూర్తిగా మునిగిపోయారు. మునిగిపోతూ పిల్లలు చేస్తున్న ఆర్థనాదాలు విని భయబ్రాంతులకు గురైన మిగిలిన నలుగురు పిల్లలు చెరువు నుంచి బ యటికి పరుగులు తీశారు.
చెరువు సమీపంలోనే ప శువులను మేపుతున్న ఓ వ్యక్తి గమనించి పిల్లలను ఆపి ఆరా తీయగా విషయం చెప్పారు. సదరు వ్యక్తి వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసు లు వచ్చే లోపు ముగ్గురు పిల్లలు నీళ్లలో మునిగిపోయారు. వెంటనే గజ ఈతగాళ్లతో చెరువు లో మునిగిపోయిన విద్యార్థులను బ యటకు తీసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. మృతి చెం దిన చిన్నారులు గణేశ్‌రెడ్డి, రక్షితల తల్లి కొన్నేండ్ల కిందట మృతిచెందింది. దీవతో ధర్మారె డ్డి ఇద్దరు పిల్లలను హైదరాబాద్‌లోని బండ్లగూడలో సరస్వతీ శిశు మందిర్‌లో చదివిస్తున్నాడు.
పాఠశాలకు సెలవులు రావడంతో ఈ మధ్యనే వారు ఇంటికి వచ్చి ఆటపాటలతో సంతోషంగా గడుపుతున్న పిల్లలు కళ్లముందే శాశ్వతంగా దూరం కావడంతో ధర్మారెడ్డి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. మృతిచెందిన మరో బాలుడు శ్రావణ్‌కుమార్ తల్లిదండ్రులు సుధాకర్, రాధ రెక్కల క ష్టంపై ఆధారపడి జీవనం గడిపేవారు. చిన్నచిన్న ప నులకు ఆసరాగా ఉంటున్న కుమారుడు మృతి చెం దడంతో వారు కన్నీటి పర్యంతమయ్యారు. ముగ్గు రు విద్యార్థులు మృత్యువాత పడడంతో బాధిత కు టుంబ సభ్యుల ఆర్థనాదాలు అందరినీ కంటతడి పె ట్టించాయి. చిన్నారుల మృతదేహాలను పోస్టుమా ర్టం నిమిత్తం నాగర్‌కర్నూల్‌కు తరలించారు. కాగా, శ్రావణ్ 2వ తరగతి, గణేశ్‌రెడ్డి 7వ, రక్షిత 5వ తరగతి చదువుతున్నారు.