Kollapur town | కొల్లాపూర్, మార్చి 06: కొల్లాపూర్ మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం పార్టీ మండల కార్యదర్శి బి శివవర్మ, టౌన్ కార్యదర్శి ఎండి సలీం జిల్లా కమిటీ సభ్యులు ఎం తారా సింగ్ మాట్లాడుతూ.. కొల్లాపూర్ పట్టణంలో 7 ,8వ వార్డుల పరిధిలో ఉన్న బస్సు డిపో పక్కన ఉన్న ప్రభుత్వ భూమిని ఇండ్ల స్థలాల కోసం 1981లో కొనుగోలు చేసి అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు పట్టాలిచ్చారు.
ప్రభుత్వం వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది.. కానీ నేటికీ హామీ హామీగానే మిగిలిందని.. హామీని అమలు చేయడం మాత్రం లేదన్నారు.
కాబట్టి అర్హులైన పేదలకి ఇంటి స్థలాలు పట్టాలిచ్చి మోకా చూపించాలని ప్రభుత్వాన్ని కోరారు. గత కొన్ని సంవత్సరాల నుండి కొంతమంది ఇండ్లు కట్టుకొని అక్కడే నివాసం ఉంటున్నారు. అక్కడ రోడ్లు కానీ.. త్రాగునీటి సౌకర్యంగానీ.. కరెంటు సౌకర్యం గానీ లేక ఇబ్బందులు పడుతున్నారు.
కాబట్టి స్థానిక మంత్రి దీనిపైన తక్షణమే చొరవ తీసుకొని అర్హులైన పేదలకు ఇండ్ల స్థలాలు పట్టాలు ఇచ్చి.. పట్టాలు ఇచ్చిన వారికి మోఖా చూపించి ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలను సమీకరించి పోరాటాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజు నాగల లక్ష్మయ్య పిట్టల రాంబాబు కే రాజు తదితరులు పాల్గొన్నారు.
S Jaishankar | అధిక సుంకాలతో భారత్ – అమెరికా వాణిజ్య సంబంధాలపై అనిశ్చితి.. జై శంకర్ ఏమన్నారంటే..?
Bandlaguda Jagir | చెత్త బండ్లగూడ.. మున్సిపాలిటీలో పారిశుద్ధ్యంపై పట్టింపేది?
Janhvi Kapoor| రామ్ చరణ్ కొత్త సినిమా నుండి జాన్వీ లుక్ రిలీజ్.. ఒక్కసారిగా పెరిగిన అంచనాలు