మాగనూరు, నవంబర్ 26 : మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం మూడోసారి ఫుడ్ పాయిజన్ అయ్యింది. పాఠశాలలో 597 విద్యార్థులకుగా నూ 400 మంది హాజరయ్యారు. వారం రోజులుగా ఇన్‌చార్జ్జి తాసీల్దార్ సురేశ్‌కుమార్ సమక్షంలో మధ్యాహ్న భో జనం వడ్డిస్తున్నారు. మంగళవారం మహిళా సంఘం ఎం పిక చేసిన ఏజెన్సీ ద్వారా వంట చేయగా.. సురేశ్‌కుమార్, ఉపాధ్యాయులు తనిఖీ చేశారు. విద్యార్థులు మధ్యాహ్నం భోజనం చేయగా.. మూడు గంటల సమయంలో వాంతు లు, కడుపువొప్పి, చలి జ్వరంతో బాధపడ్డారు. గమనించిన ఉపాధ్యాయులు బైకులపై మాగనూరు ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
దాదాపు 27 మంది విద్యార్థులను అంబులెన్స్‌లో తరలించేందుకు ఎదురుచూడగా.. ఎం తకూ రాకపోవడంతో గ్రామస్తులు కార్లలో మక్తల్ ప్రభు త్వ దవాఖానకు తరలించారు. ఎక్కడ పొరపాటు జరిగి ఫుడ్ పాయిజన్ అవుతుందో తెలియడం లేదని సురేశ్ చె బుతున్నారు. విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్ బెన్‌షాలం మాగనూరుకు చేరుకొని ఫుడ్‌పాయిజన్‌పై విచారణ చేపట్టారు. వంట నిర్వాహకులు, ఉపాధ్యాయులను డీఎ స్పీ లింగయ్య పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. కాగా, విద్యార్థులు జంక్‌ఫుడ్ తినడం వల్లే అస్వస్థతకు గురయ్యారని కలెక్టర్ సిక్తా పట్నాయక్ చెప్పడంతో ఎస్బీ సీఐ రాంలాల్ పాఠశాల పరిసరాల్లోని కిరాణాషాపుల యజమానులతో విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా, జెడ్పీహెచ్‌ఎస్‌లోని వాటర్ ట్యాంక్ నీటిని శాంపిల్ కోసం సేకరించారు.
అధికారులు చెబుతున్న ప్రకటనలపై విద్యార్థుల తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తంచే స్తున్నారు. తమ పిల్లలు బయట ఏమమీ తినలేదన్నారు. ఇంత జరిగినా దుకాణా ల్లో ఫుడ్‌సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసి శాంపిల్స్ కూడా తీసుకోలేదు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి ఆ యా దుకాణాల్లో విచారణ చేపట్టారు. చివరకు రాత్రి ఏడున్నర గంటలకు ఫుడ్ సేఫ్ట్టీ అధికారి అకడికి చేరుకున్నారు.
మక్తల్, నవంబర్ 26 : మక్తల్ దవాఖానలో చికిత్స పొందుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలు చదువుకొని మంచి ప్రయోజకులు కావాలని పాఠశాలకు పంపిస్తే ఇలా ఎందుకు చేస్తున్నారంటూ విలపించారు. విషయం తెలుసుకున్న డీఎంహెచ్‌వో సౌ భాగ్యలక్ష్మి దవాఖానకు చేరుకొని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. విద్యార్థులు ఆరోగ్యం కుదుటపడే వరకు వై ద్యులు దవాఖానలోనే ఉండాలని ఆదేశించారు. అయితే, తీవ్ర అస్వస్థతకు గురైన నేత్ర, దీపికను మహబూబ్‌నగర్ జిల్లా దవాఖానకు రెఫర్ చేశారు.
మహబూబ్‌నగర్, నవంబర్ 26 : మాగనూర్ ప్రభు త్వ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో మహబూబ్‌నగర్ జనరల్ దవాఖానకు తరలించారు. వీరికి వైద్యులు పలు టెస్టులు చేసి చికి త్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి మెరుగ్గా ఉం దని ఆర్ఎంవో శిరీష తెలిపారు. విషయం తెలుసుకున్న మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి విద్యార్థులను పరామర్శించారు.
నారాయణపేట, నవంబర్ 26 : మాగనూరు జెడ్పీహెచ్‌ఎస్‌ను అధికారులు, ఉపాధ్యాయులు, విలేకరులు స్వ యంగా పర్యవేక్షించి విద్యార్థులతో కలిసి ఆహారాన్ని భుజించినట్లు కలెక్టర్ సిక్తాపట్నాయక్ తెలిపారు. 22 మంది విద్యార్థులకు కడుపునొప్పి, వాంతులు, వికారంగా ఉన్నట్లు నివేదించారు. మధ్యాహ్న భోజనంలో అన్నం, పప్పు, వంకాయ కూర వడ్డించారని చెప్పారు. అధికారులతో పాటు ఐదుగురు విద్యార్థులు, సిబ్బంది విద్యార్థుల కు వడ్డించిన ఆహారాన్ని తిన్నారన్నారు.
బియ్యం స్టాక్‌ను మార్చామని, కొత్త స్టాక్ వినియోగించామని, బయటి ఏజెన్సీ నుంచి కొనుగోలు చేసిన శుద్ధి చేసిన నీటినే వంట కు వాడినట్లు పేర్కొన్నారు. భోజనానికి ముందు దుకాణా లు, బేకరీల్లో తినుబండారాలు తిన్నందువల్లే అస్వస్థతకు గురయ్యారన్నారు. మధ్యాహ్న భోజనం వల్ల ఇబ్బంది లేదని విచారణలో తేలిందన్నారు. మండలస్థాయి ప్రత్యేక అధికారులు పాఠశాలలను సందర్శించి తనిఖీ చేసి స్టాకులను ధ్రువీకరించారని, పలు పాఠశాలలకు నోటీసులు అందజేసి చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.