గండీడ్/మహ్మదాబాద్, జూన్ 10 : రాష్ట్రంలో ప్రజాపాలన సాగిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మాత్రం తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తున్నది. ముఖ్యంగా పీఏసీసీఎస్‌లో రుణాలు తీసుకున్న రైతులు సకాలంలో వాటిని చెల్లించకపోవడం తో వారి భూములను వేలం వేయనున్నట్లు ప్రకటించిం ది. ఇందుకు సంబంధించి పీఏసీసీఎస్ కార్యాలయంతోపాటు గండీడ్, మహ్మదాబాద్ తాసీల్దార్ కార్యాలయాల వద్ద వేలం వేసే భూములకు సంబంధించిన వివరాలను నోటీసు బోర్డుపై అంటించడమే వీరి ప్రజా పాలనకు నిలువుటద్దం పడుతున్నది.
వివరాల్లోకి వెళితే గండీడ్, మహ్మదాబాద్‌కు చెందిన రైతులు సహకార సంఘంతోపాటు కోఆపరేటీవ్ బ్యాంకులలో వివిధ అవసరాల నిమిత్తం స్థిరాస్థి తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు. రుణాలు సకాలంలో చెల్లించనందున వారిపై డిక్రీ పొంది, ఈపీ ఫైల్ తయారు చేసి బకాయిపడ్డ రైతుల స్థిరాస్థి సంఘానికి తాకట్టు పెట్టబడంతో వారి భూములను వేలం వేయడానికి సిద్ధం అయ్యింది. ఉమ్మడి మం డలంలో 14మంది రైతుల ఆస్తులు జప్తు చేయడానికి సిద్ధం కాగా సోమవారం ఆరుగురు రైతుల లిస్టును అధికారులు నోటీసు బోర్డుపై అంటించారు.
అందులో మ హ్మదాబాద్ మండలం నుంచి బాలవర్ధన్‌రెడ్డి (వెంకట్‌రెడ్డిపల్లి), మణిబాయి (తువ్వగడ్డతండా), రఘకుమార్, శివమ్మ (దేశాయిపల్లి) గండీడ్ మండలం నుంచి మహేశ్వర్‌రెడ్డి, రాజ్‌కుమార్‌రెడ్డి (రుసుంపల్లి), మన్యానాయక్ (పగిడ్యాల్) గ్రామాల రైతులు భూములు వేలం వేస్తున్నట్లు సహకార సొసైటీ సిబ్బంది బహిరంగంగా నోటీసు బోర్డులపై అతికించారు. ఉమ్మడి మండలంలో రూ.20 వేల నుంచి 15 లక్షలు రుణం తీసుకున్న రైతులు 1130 మంది ఉండగా అందులో 750 మంది రైతులు బకాయిపడ్డట్లు సిబ్బంది చెబుతున్నారు.
వీరికి మొదట నోటీసులు జారీ చేసిన అనంతరం డిమాండ్ నోటీసులు, సెక్ష న్ 71నోటీసులు, ఈపీఐ వంటి నోటీసులు జారీ చేసి కోఆపరేటీవ్ సొసైటీ చట్టం ప్రకారం నోటీసులు జారీ చే సినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో ఎన్నో ప్రయోజనాలతో కూడి న కార్యక్రమాలు చేపడుతున్నట్లు ప్రజలకు చెబుతూ ఆచరణలో రుణాలు చెల్లించని రైతుల ఆస్తులు జప్తు చేస్తామని, భూములు వేలం వేయాలని చెప్పడం ఎంత వరకు సమంజసం అని వివిధ గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కేవలం రూ.వేలల్లో ఉన్న రైతుల పేర్లు మాత్రమే నోటీసు బోర్డులో పెట్టి రూ.లక్షలు ఉన్న వారి పేర్లుపెట్టక పోవటం ఏమిటనని రైతులు ప్రశ్నిస్తున్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి దుర్భర పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోకపోతే మరణమే శరణ్యం అని రైతులు వాపోతున్నారు.
రైతులకు సమాచారం అందించాం
రుణ బకాయిలు పడ్డ రైతులకు ప్రతి వారానికోసారి సమాచారం అందించాం. సహకార సంఘంలో మొం డి బకాయిలు ఉన్న రైతుల్లో మొదటి విడుతగా 14 మంది రైతులకు నోటీసులు ఇచ్చిన అనంతరం ఆరు మంది రైతుల భూములు వేలం వేస్తున్నట్లు ప్రకటిం చాం. బకాయిపడ్డ వారు దాదాపు 120 మంది దాకా ఉన్నారు. వారికి కూడా నోటీసులు సిద్ధం చేస్తున్నాం
– ఆశన్న, సీఈవో, పీఏసీసీఎస్ గండీడ్
రుణాలు ఇవ్వలేక పోతున్నాం
ఉమ్మడి మండలంలో చాలా మంది రైతులు తీసుకు న్న రుణాలు సకాలంలో చెల్లించడం లేదు. రుణాలు చె ల్లించాలని లీగల్ అన్ని రకాల నోటీసులు ఇచ్చినా వారు స్పందించకపోవడంతో భూములు వేలం వేసేందుకు సిద్ధమయ్యాం. జూన్‌లో 50 శాతం రికవరీ అయితేనే కొత్త వారికి రుణాలు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది.
– వెంకటయ్య, కోఆపరేటీవ్ బ్యాంక్ మేనేజర్, మహ్మదాబాద్
రిపీట్ ఇవ్వమంటే ఇవ్వడం లేదు
వన్‌టైం సెటిల్మొంట్ కింద 30 శాతం రిపీట్ అడిగాము. సొసైటీ సిబ్బంది ఇవ్వలేదు. రిపీట్ ఇస్తే మొత్తం లోన్ కట్టాడానికి సిద్దం అని కూడా చెప్పినా వినకుండా భూమి వేలం వేస్తున్నట్లు నోటీసు బోర్డుపై వేయడం ఎంతవరకు సమంజసం. ఇది కక్షపూరితంగా వ్యవహరిస్తున్నట్లు ఉన్నది.
– డీ రఘుకుమార్, రైతు, దేశాయిపల్లి, మహ్మదాబాద్ మండలం
రెండువారోల్లో చెల్లిస్తామన్నాం
రెండు మూడు వారాల్లో రుణం మొత్తం చెల్లిస్తామని అధికారులకు చెప్పినా వినకుండా మా పేర్లు నోటీసు బోర్డుపై ఉంచారు. నేను లోన్ కట్టను అని ఎప్పుడూ చెప్పలేదు. ఇలా భూములు వేలం వేయడం, ఇండ్లకు తాళాలు వేయడం మా తాతల కాలంలో చూశాం. తీరా మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వంలో చూడాల్సి వచ్చింది.
– బాలవర్ధన్‌రెడ్డి, రైతు. వెంకట్‌రెడ్డిపల్లి. మహ్మదాబాద్ మండలం