Telangana | మహబూబ్‌నగర్‌లో విచ్చలవిడిగా ప్లాస్టిక్.. స్పెషల్‌డ్రైవ్ నిర్వహించినా తగ్గని అమ్మకాలు
Telangana | ప్లాస్టిక్ వినియోగం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ప్రభుత్వం ఎన్ని నిబంధనలు తీసుకువచ్చినా ప్లాస్టిక్ కవర్ల వినియోగం మాత్రం తగ్గడంలేదు. ప్రమాణాలకు లోబడి తయారు చేసిన ప్లాస్టిక్‌ను మాత్రమే వాడాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఫలితం లేకుండాపోతున్నది.
Telangana | మహబూబ్‌నగర్‌టౌన్, ఫిబ్రవరి 26 : ప్లాస్టిక్ వినియోగం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ప్రభుత్వం ఎన్ని నిబంధనలు తీసుకువచ్చినా ప్లాస్టిక్ కవర్ల వినియోగం మాత్రం తగ్గడంలేదు. ప్రమాణాలకు లోబడి తయారు చేసిన ప్లాస్టిక్‌ను మాత్రమే వాడాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఫలితం లేకుండాపోతున్నది. అధికారులు అడపాదడపా నిర్వహిస్తున్న దాడులతో ప్లాస్టి క్ కవర్ల నిషేధం పూర్తిస్థాయిలో అదుపులోకి రావడం లేదు. వ్యాపారులు మాత్రం సరుకుల క్రయవిక్రయాలన్నీ ప్లాస్టిక్ కవర్లలోనే కొనసాగిస్తున్నారు.
మున్సిపాలిటీలో స్పెషల్‌డ్రైవ్
ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టా రు. ఇందుకోసం ముగ్గురు పారిశుధ్య విభా గం అధికారులు. ఒక హెల్త్ అస్టిస్టెంట్ ఆధ్వర్యంలో నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ కవర్ల నిషేధంపై అవగాహన కల్పించేందుకు మున్సిపల్ అధికారులు, సిబ్బంది ప్రతి దుకాణానికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేయడంతోపాటు స్టిక్కర్లు అతికించారు. 75 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు, ప్లేట్స్ నిల్వచేసి అమ్మినా, వినియోగించినా జరిమానాతోపాటు చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని దుకాణాదారులకు అవగాహన కల్పించారు. స్పెషల్‌డ్రైవ్‌లో భాగంగా మున్సిపల్ బృందాలు తనిఖీలు నిర్వహించి నిబంధనలను ఉల్లంఘించిన వారికి రూ.2లక్షలకుపై గా జరిమానా విధించడంతోపాటు 1500 కిలోల ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకున్నా రు. అయినప్పటికీ దుకాణాదారుల్లో మా ర్పు రావడంలేదు. క్లాక్‌టవర్, మార్కెట్, న్యూటౌన్, వన్‌టౌన్, పద్మావతికాలనీ తదితర ప్రాంతాల్లో 75 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ కవర్లను అమ్ముతున్నారు. అదేవిధంగా దుకాణాల్లో మూడు డబ్బాలను ఏర్పాటు చేసుకొని తడి, పొడి, ప్రమాదకర వ్యర్థాలను నిల్వచేసి మున్సిపల్ సిబ్బందికి అందజేయాలి. నిబంధనలను ఉల్లంగించే వారికి ఎస్డబ్ల్యూఎం నిబంధనల మేరకు రూ.వెయ్యి నుంచి రూ.10వేల వరకు జరిమానా విధిస్తారు. మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ప్లాస్టిక్ నిషేధం, చెత్త డబ్బాల ఏర్పాటుపై పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తే చర్యలు
ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తే చర్యలు తప్పవు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు 75 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ కవర్లను నిల్వచేసి విక్రయించినా, వినియోగించినా రూ.వెయ్యి నుంచి రూ.25వేల జరిమానా విధిస్తాం. స్పెషల్‌డ్రైవ్‌కు నాలుగు బృందాలను ఏర్పాటు చేశాం. ప్రజలు సంచి సంచులను వినియోగించి ప్లాస్టిక్ నిషేధం పాటించాలి.
– ప్రదీప్‌కుమార్, మున్సిపల్ కమిషనర్
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

