పర్వతారోహకుడు నిర్మాల్ పుర్జా మృతదేహం లభ్యం
ప్రపంచ ప్రఖ్యాత బ్రిటిష్- నేపాల్ పర్వతారోహకుడు నిర్మాల్ పుర్జా మృతదేహాన్ని పాకిస్థాన్ పరిధిలోని గిల్గిత్- బాల్టిస్థాన్‌లోని బ్రాడ్ పీక్‌పై సంభవించిన హిమపాతం ప్రాంతంలో సహాయక సిబ్బంది వెలికితీశారు.
న్యూఢిల్లీ: ప్రపంచ ప్రఖ్యాత బ్రిటిష్- నేపాల్ పర్వతారోహకుడు నిర్మాల్ పుర్జా మృతదేహాన్ని పాకిస్థాన్ పరిధిలోని గిల్గిత్- బాల్టిస్థాన్‌లోని బ్రాడ్ పీక్‌పై సంభవించిన హిమపాతం ప్రాంతంలో సహాయక సిబ్బంది వెలికితీశారు. గురువారం జరిగిన ఈ ప్రమాదంలో ఆయనతో పాటు తొమ్మిది మంది పర్వతారోహకులు ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచంలోనే 12వ అత్యంత ఎత్తైన, అత్యంత క్లిష్టమైన బ్రాడ్ పీక్ పర్వతంపై సుమారు 5,700 మీటర్ల ఎత్తులో నిర్మల్ పుర్జా మృతదేహాన్ని గ్రౌండ్ రెస్క్యూ టీమ్ గుర్తించినట్లు ఆల్పైన్స్ క్లబ్ ఆఫ్ పాకిస్థాన్ వెల్లడించింది.
అదే ప్రాంతంలో మరో మూడు మృతదేహాలు కూడా కనిపించినప్పటికీ, వాటి వివరాలు ఇంకా ధృవీకరించాల్సి ఉంది. గత సోమవారం ఆక్సిజన్ సహాయం లేకుండా ప్రపంచంలోని 14 అత్యంత ఎత్తయిన శిఖరాలను అధిరోహించిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించేందుకు చేరువలో ఉన్నానని నిర్మల్ పుర్జా ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. అయితే ఇంతలోనే విషాదం చోటుచేసుకుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

