కొల్లాపూర్, జనవరి 23 : శ్రీశైలం బ్యాక్ వాటర్ కృష్ణానదిలో చేపల వేటే జీవనాధారమైన నల్లమల చెంచులు తాము పట్టిన చేపలు దళారుల శ్రమదోపిడీకి గురికాకుండా గతంలో కేసీఆర్ సర్కారు చర్యలు చేపట్టింది. పట్టిన చేపలను దళారులకు విక్రయించకుండా చెంచులే యజమానులుగా నేరుగా హైదరాబాద్‌తోపాటు ఇతర పట్టణాలకు తరలించి విక్రయించే వెసులుబాటు కల్పించింది. అయితే ఐటీడీఏ అధికారుల నిర్వాకం మూలం గా గత సర్కారు ఆశయానికి తూట్లు పొడిచారు. నల్లమలలోని శ్రీశైలం బ్యాక్ వాటర్ కృష్ణానదిలో చేపల వేటే ప్రధాన ఆధారంగా జీవిస్తున్న కొల్లాపూర్ మండలం అమరగిరిగూడెం గిరిపుత్రుల జీవితాల్లో వెలుగు నింపాల్సిన ఐటీడీఏ అధికారుల నిర్వాకంతో ఉపాధి లేక తం డ్లాడుతున్నారు. నదిలోకి వెళ్లి చేపలు పట్టుకోవడానికి మొక్కుబడిగా మచ్చుకు కొన్ని పుట్టీలిచ్చారు. కానీ న దిలో చేపలను పట్టుకోవడానికి వలలు ఇవ్వడం మరిచిపోయారు. అమరగిరి గూడెంలో 44చెంచు కుటుంబా లు నదిలో చేపల వేటపైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. ఐటీడీఏ నుంచి మంజూరైన 44 మంది చెం చులకుగానూ 23 మందికి అధికారులు పుట్టీలు ఇ చ్చారు. అవి చెంచుల ఇండ్ల ముంగిట మూడు నెలలుగా వినియోగంలో లేకుండా ఉన్నాయి. ఇంకా 21మందికి పుట్టీలు, ఒక మరబోటు రావాలి. అంతే కాకుండా ఒక్కొక్కరికీ 30కిలోల నైలాన్ వలలు ఐటీడీఏ నుంచి పూర్తిగా అందాలి. కానీ గత కొన్ని నెలల నుంచి చెంచులకు చేపలు పట్టే సామగ్రి రాక కోసం నిరీక్షిస్తున్నారు. అయితే సమీపంలోని అడవుల్లో లభించే అటవీ ఉత్పత్తుల సేకరించుకునేందుకు వెళ్లాలన్నా అటవీ అధికారులు అడ్డుకుంటున్నారని చెంచులు ఆరోపిస్తున్నారు.
అమరగిరిగూడెం చెంచుల జీవనోపాధి కోసం ఐటీడీఏ అధికారులు రూ.31లక్షల వ్యయంతో ఒక ప్రాజెక్టును చేపట్టారు. ఇందులో ఐటీడీఏ వాటా ధనం రూ. 21 లక్షలు, స్థానిక బ్యాంకు ద్వారా రూ.10 లక్షలతో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. చెంచులు పట్టిన చేపలు నిల్వ చేసుకోవడానికి అమరగిరి గూడెంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కోల్ట్ స్టోరేజ్ నిర్మాణం చేశారు. ప్రస్తుతం అది వినియోగంలో లేక నిరుపయోగంగా మారింది. మార్కెట్లో చేపల ధరలు ఎక్కడ అధికంగా పలికితే హైదరాబాద్ లాంటి నగరాలకు చేపలను చేరవేసేందుకుగానూ చెంచులకు బొలెరో వాహనాన్ని సమకూర్చాలి. కానీ ఇప్పటి వరకు వాహనం అతీగతీ లేదని గిరిపుత్రులు వాపోతున్నారు.
ఇదే తరహాలో ఎల్లూరు చెంచుగూడెంలో కూడా ప్రాజెక్టును చేపట్టారు. కానీ ఇప్పటి వరకు రెండు చోట్ల అమలు కావడం లేదని ఆయా గూడెం చెంచులు ఆరోపిస్తున్నారు. ఐటీడీఏ అధికారులు చిత్తశుద్ధితో చెంచుల కు చేపలు పట్టేందుకు కావల్సిన సామగ్రిని పూర్తి స్థా యిలో పంపిణీ చేసి ఈ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన అమలు చేయకపోవడంతో ఉపాధిలేక తండ్లాడుతున్నా రు. వలలు ఉన్నా కొందరు చెంచులు నదిలో పట్టే చేపలను స్థానిక దళారులకు మొక్కుబడి ధరలకు విక్రయిం చి తమ పిల్లాజెల్లలను పోషించుకోవాల్సి వస్తుందని పలువురు గిరిపుత్రులు వాపోతున్నారు.
ఐటీడీఏ అధికారులు చొరవ తీసుకొని నదిలో చే పలు పట్టేందుకు కావల్సిన పనిముట్లను పూర్తి స్థాయి లో పంపిణీ చేసి మాకు జీ వనోపాధి చూపాలి. అమరగిరి గూడెంలో 44మంది కి వలలు, పుట్టీలు (ఒకటి మరబోటు సామూహికం గా) మంజూరైతే 23 మం దికి మాత్రమే పుట్టీలు ఇ చ్చారు. మిగతా 21 మందికి పుట్టీలు, అందరికీ వల లు అందాలి. అవి ఎప్పుడోస్తాయోనని కొండకు ఎదురుచూస్తున్నట్లుంది. ఉన్నతాధికారులు స్పందించి పు ట్టీలు, వలలు అందించేందుకు చర్యలు తీసుకోవాలి.
ఐటీడీఏ అధికారులు అందరికీ పుట్టీలు, వలలు అందజేయాలి. వేసవి ఎం డలు రాకముందే కృష్ణానదిలో నీరు లోపలికి పోతున్నాయి. మాకు పనిముట్లు తొందరగా ఇస్తే చేపలు ప ట్టుకొని బతుకుతాం. గత రెండు నెలలుగా కూలీ ప నులు లేకపోవడంతో పూ ట గడవడం కూడా కష్టం గా మారింది. అడవిలో ఉన్నందుకు చేపల వేటే మా కు జీవనాధారం. జిల్లా అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలి.