మండలంలోని పద్మన్నపల్లి గ్రామ చెంచు కాలనీలో వారం రోజులుగా తాగునీరు లేక చెంచులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారం కిందట కాలనీలో ఉన్న బోరు మోటరు కాలిపోయినట్లు వీటీడీఏ అధ్యక్షుడు సలేశ్వరం తెలిపారు.
తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల సరిహద్దు పూర్తిగా అటవీప్రాంతంలో ఉన్న గుబ్బుల మంగమ్మ ఆలయం భక్తుల కోర్కెలు తీర్చే అమ్మవారిగా ప్రసిద్ధి చెందింది. ఆలయంపై జాలువారే జలపాతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది.